తండ్రి పెద్ద నిర్మాత. అన్న సూపర్ స్టార్. తమ్ముడికి మాత్రం దశ తిరగడంలేదు. ఇప్పటికి నాలుగేళ్ళుగా పరిశ్రమిస్తున్నా అల్లు శిరీష్ ఖాతాలో ఓ హిట్ పడలేదు. ఏబీసీడీ అంటూ ఇవాళా జనం ముందుకు వచ్చాడు శిరీష్. మీ మూవీతోనైనా జాతకం మారుతుందా అని చూస్తున్నారు. ఈ సినిమా ఓ రీమేక్. అక్కడ పెద్ద హిట్. దానికి తోడు మూవీ చూసిన చిత్ర ప్రముఖులు కూడా సినిమా బాగుందని అంటున్నారు.


బిగ్‌ బెన్‌ సినిమాస్‌ పతాకాలపై రూపొందిన  ఎంటర్‌టైనర్‌ 'ఏబీసీడీ'. 'అమెరిక్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశి' ట్యాగ్‌ లైన్‌. సంజీవ్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతోన్న ఈ సినిమాను మధుర శ్రీధర్‌ రెడ్డి, యష్‌ రంగినేని నిర్మిస్తున్నారు. ఈ సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. సినిమాకు క్లీన్ యు స‌ర్టిఫికేట్ వ‌చ్చింది. సినిమాను ఈ రోజున  17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్ చేశారు. 


ఓ విధంగా శిరీష్ కి సూట్ అయ్యే క్యారక్టర్ ట. దాన్ని సజెస్ట్ చేసింది కూడా మెగా పవర్ స్టార్ రాం చరణ్ ట. దాంతో శిరీష్ ఈ మూవీని చాలా కాన్ ఫిడెంట్ గా చేశాడని అంతా అంటున్నారు. ఈ మూవీతో స్టార్ గా కూడా ఎదుగుతాడని అంటున్నారు. మరి చూడాలి  అల్లు శిరీష్ కెరీర్లో ఈ మూవీ ఎలాంటి రిజల్ట్ తెస్తుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: