దేశ వ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించింది బిగ్ బాస్.  బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ బిగ్ బాస్  ఇప్పటికే 12 సీజన్లు కంప్లీట్ చేసుకుంది.  తెలుగు, తమిళ, మళియాళ, కన్నడ భాషల్లో కూడా బిగ్ బాస్ వస్తుంది.  తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేశారు.  బిగ్ బాస్ సీజన్ 2 కి నేచురల్ స్టార్ నాని హూస్ట్ గా చేశారు..ఇక బిగ్ బాస్ సీజన్ 3 కి ఎవరు అన్న విషయంపై రక రకాల వార్తలు వస్తున్నాయి. మొత్తానికి కింగ్ నాగార్జున అని అంటున్నారు..ఇది ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. 

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ నటి శ్రీరెడ్డి వివాదాలకు తెర లేపింది.  ఆ మద్య బిగ్ బాస్ 2 లో శ్రీరెడ్డి కంటిస్టెంట్ గా వస్తుందని వార్తలు వచ్చాయి..కానీ ఆమె ఆ సీజన్ లో లేదు. ఇప్పుడు తను చేసే రచ్చ బిగ్ బాస్ షోలో చేయడానికి సిద్ధమవుతుందని టాక్. కాకపోతే శ్రీరెడ్డి వస్తుంది తెలుగు లో కాదట..తమిళనాట వస్తున్న బిగ్ బాస్ సీజన్ 3 కి కంటిస్టెంట్ గా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  గత కొంతకాలంగా శ్రీరెడ్డి తమిళనాడులో మకాం పెట్టిన విషయం తెలిసిందే. 

తాజాగా శ్రీరెడ్డికి తమిళ బిగ్ బాస్ 3 లో పాల్గొనే ఛాన్స్ వచ్చిందని చెబుతున్నారు. షో విషయానికొస్తే.. తమిళంలో ప్రస్తుతం బిగ్ బాస్ 3కి సన్నాహాలు జరుగుతున్నాయి. గత రెండు సీజన్ లకు కమల్ హాసన్ హోస్ట్ చేయగా.. మూడో సీజన్ కూడా ఆయనే హోస్ట్ చేస్తున్నారు. ఇక కోలీవుడ్ లో బిగ్ బాస్ సీజన్ 3 లో శ్రీరెడ్డి గనక ఉంటే రచ్చ రచ్చే అంటున్నారు కొంది మంది నెటిజన్లు. అంతే కాదు మరికొంత మంది దయచేసి శ్రీరెడ్డిని తీసుకురావొద్దంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.  ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ సీజన్ 3 కి కమల్ హాసన్ హూస్ట్ గా ఉంటున్నారని వార్తలు వస్తున్న విషయం విధితమే. 



మరింత సమాచారం తెలుసుకోండి: