ఈ మధ్య కాలం లో ఆన్లైన్ ఛాలెంజ్ లు ఏక్కువైపోయాయి. మాములు ప్రజలు నుండి సెలేబ్రిటిలు వరకు ఏదైనా ఒక అంశం పై ఒకరి పై ఒకరు ఛాలెంజ్ లు విసురుకుంటున్నారు. కొన్నేళ్ళ నుండి చూసినట్లయితే #ఐస్ బకెట్ ఛాలెంజ్ నుండి #స్వచ్ భారత్ వరకు చాల ఛాలెంజ్ లు హల చల్ చేసాయి. ఒక సెలెబ్రిటి ఇంకా సెలబ్రిటీస్ కి ఛాలెంజ్ ఇచ్చుకుంటూ వాల్ల వీడియోల తో హడావడి చేసారు .

 

అన్నిటికంటే పెద్ద వైరల్ గా మారిన ఛాలెంజ్ ఐస్ బకెట్ ఛాలెంజ్ అనే చెప్పాలి. ఒక బకెట్ తో ఐసు ముక్కలను తీసుకుని ఒకేసారి తలమీద నుండి వేసుకోవడం చాల విచిత్రం గా అనిపించినా అదే ఒక కొత్త ట్రెండ్ గా మారి యు ట్యూబ్ అంతా మారుమోగింది. ఎంతో మంది తమిళ, తెలుగు, హిందీ , హాలీవుడ్ నటినటులు ఈ ఐస్ బకెట్ ఛాలెంజ్ లో పాల్గొన్నారు వారి వీడియోస్ ని అప్లోడ్ కూడా చేసారు. వాటికీ మంచి స్పందన వచ్చింది కుడా ఆడియన్స్ నుండి.

 

ఇదిలా ఉండగా లేటెస్ట్ గా అక్కినేని అమల #రీడింగ్ ఇస్ గుడ్ ఛాలెంజ్ అనే కొత్త ఛాలెంజ్ ని ట్విట్టర్ లో పబ్లిష్ చేసారట. ఈ ఛాలెంజ్ ప్రముఖ పుస్తక రచయిత “అమర్ చిత్ర కథ “ముందుగా మొదలపెట్టారట. తరువాత చాల నటుల దగ్గరకు ఈ ఛాలెంజ్ వెళ్ళింది. ఇప్పటి వరకు రానా దగ్గుబాటి , అడివి శేష్ కుడా ఈ ఛాలెంజ్ ని ఒప్పుకుని ఫోటో లు దిగి మరి వారి వారి ఎకౌంటు లో పోస్ట్ లు కూడా పెట్టారు.

 

రీసెంట్ గా మన నాగ్ భార్య అయిన అక్కినేని అమల కూడా “స్టోరీస్ యట్ వర్క్ “ అనే పుస్తకం తో సేల్ఫీ దిగి సమంత అక్కినేని కి , ఉపాసన కామినేని కి, సుమంత్ కు ఈ ఛాలెంజ్ ని ఇస్తూ పోస్ట్ చేసారట. అయితే ఈ ముగ్గురు కు పుస్తకాలు చదివే అలవాటు ఉండనే ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: