టాలీవుడ్‌లో రాను రాను సినిమాల నిడివి పెరిగిపోతోంది. బాహుబ‌లి 1, శ్రీమంతుడు, బాహుబ‌లి 2, భ‌ర‌త్ అనే నేను, రంగ‌స్థ‌లం తాజాగా మ‌హ‌ర్షి ఇలా పెద్ద సినిమాలు ఎక్కువ నిడివితో వ‌చ్చినా అవి వ‌చ్చిన టైంనో లేక క‌థ బాగుండ‌డం వ‌ల్లో అవి హిట్ అయ్యాయి. ఇప్పుడు చిన్న సినిమాల‌కు కూడా దీనినే సెంటిమెంట్‌గా తీసుకుంటున్నారు. ఇక మ‌హ‌ర్షి యావ‌రేజ్ టాక్ తెచ్చుకున్నా దీనిని థియేట‌ర్ల‌లో మూడు గంట‌ల పాటు చూడాల్సి రావ‌డం ఓ ప్ర‌హ‌స‌నంగా మారింది. 


ఇంత ర‌న్ టైంనా అని ప్ర‌శ్నిస్తే సినిమాలో ద‌మ్ముంది అని కొంద‌రు స‌మ‌ర్థించుకుంటున్నారు. వాస్త‌వంగా చూస్తే ఆ సీన్లు అంత గొప్ప‌గా ఉండ‌డం లేదు. సినిమాను 2.15 గంట‌లు లేదా 2.30 గంట‌ల్లో చెప్ప‌డం చేత‌కాకే సాగ‌దీసి సాగ‌దీసి క‌థ‌ను కిచిడి చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులోకి బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సీత సినిమా చేరిపోయింది. 


సీత సెన్సార్ కంప్లీట్ చేసుకుని యూ / ఏ స‌ర్టిఫికెట్‌తో భారీ ర‌న్ టైంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. సీత నిడివి ఏకంగా 2 గంటల 41 నిమిషాలు ఉందనే విషయం బయటకొచ్చింది. అంటే 161 నిమిషాలు చాలా ఎక్కువే. తేజ స‌హ‌జంగా ఇంత ర‌న్ టైం పెట్టుకోడు... సినిమాలో ఎమోష‌న‌ల్ కంటెంట్ ఉండ‌డంతోనే తేజ ఇంత నిడివి ఉంచిన‌ట్టు టాక్‌. సీత‌కు హిట్ టాక్ వ‌స్తే ఓకే... లేక‌పోతే ఇంత ర‌న్‌టైంతో సినిమా విసిగించింద‌న్న టాక్ వ‌స్తే ఇక ప్రేక్ష‌కుడు థియేట‌ర్‌కు వెళ్లేందుకు సుముఖంగా ఉండ‌డం... అప్పుడు ఆ ఎఫెక్ట్ టోట‌ల్ సినిమాపై ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు. టాక్ బాగోపోతే ఇంత ర‌న్ టైంతో సీత‌ను ప్రేక్ష‌కుడు భ‌రించ‌లేడు.


మరింత సమాచారం తెలుసుకోండి: