మెగా ఫ్యామిలీలో అందరూ హీరోలు విజయవంతం అయ్యారు. కానీ  అల్లు శిరీష్‌ మాత్రం ఇంకా హీరోగా గుర్తింపు తెచ్చుకొనే దశలోనే ఉన్నాడు. ఇప్పటిదాకా ఆరేళ్లలో నాలుగు సినిమాలు చేశాడు. అందులో రెండు డిజాస్టర్లు, ఒక ఫ్లాప్. ఒక సినిమా మాత్రం హిట్. ‘శ్రీరస్తు శుభమస్తు’తో అతడికి అత్యావశ్యకమైన విజయం దక్కింది కానీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ‘ఒక్కక్షణం’ మళ్లీ అతడిని కిందికి లాగేసింది. ఇప్పుడు ‘ఏబీసీడీ’తో తిరిగి హిట్ రుచి చూడాలని వస్తున్నాడు.


కానీ థియేటర్లలో ఇంకా ‘మహర్షి’ బాగా ఆడుతుండగా, దాని చుట్టూనే చర్చలు నడుస్తుండగా.. శిరీష్ నటించిన ‘ఏబీసీడీ’ వైపు ఫ్రేక్షకులు చూస్తారా అన్నది సందేహంగా ఉంది.శుక్రవారం రిలీజవుతున్న ఈ చిత్రం శిరీష్‌కు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మంచు మోహన్ బాబు లాగా ఎన్ని ఫ్లాపులు వచ్చినా పట్టించుకోకుండా కొడుకులతో కోట్లు పెట్టి సినిమాలు చేసుకుంటూ పోయే రకం కాదు అల్లు అరవింద్. ఆయన స్ట్రాటజిగ్గా అడుగులేస్తారు.


ఊరికే డబ్బులు తగలేయరు. మెగా ఫ్యామిలీ కుర్రాడు కదా అని బయటి వాళ్లు పరుగెత్తుకొచ్చి సినిమాలు చేసేయరు. వేరే హీరోల సంగతేమో కానీ.. శిరీష్‌తో మాత్రం అలా కష్టమే. మధుర శ్రీధర్ అతడితో ‘ఏబీసీడీ’ చేయడమే ఎక్కువ. ఈ నేపథ్యంలో ‘ఏబీసీడీ’ ఆడి శిరీష్ మీద అరవింద్‌తో పాటు బయటి నిర్మాతలకు కూడా గురి కుదిరేలా చేయడం చాలా చాలా అవసరం. ఈ సినిమా టీజర్, ట్రైలర్ అయితే ఆకట్టుకున్నాయి. ఒక పాజిటివ్ ఫీల్ కలిగింది. మరి సినిమాకు ఎలాంటి టాక్ వస్తుంది.. ఏమేరకు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుంది అన్నది కీలకం. 

మరింత సమాచారం తెలుసుకోండి: