నటి రితికాసింగ్‌ రియల్‌ లైఫ్‌లో బాక్సర్‌ అన్న విషయం అందరికి తెలిసిందే.. అయితే ఆ క్రీడారంగంలో ఆసక్తి ఉన్నవారికి మాత్రమే తెలిసిన రితికాసింగ్‌ను సినిమా స్టార్‌గా పరిచయం చేసింది 'ఇరుదుచుట్రు' అనే తమిళ సినిమా. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్టవడంతో ఇదే సినిమాను మాధవన్ హీరోగా బాలీవుడ్ లోను, విక్టరీ వెంకటేష్ హీరోగా టాలీవుడ్ లో డైరెక్ట్ చేశారు సుధ. అయితే కోలీవుడ్ తోపాటు ఇదే సినిమాతో బాలీవుడ్, టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది రితికా సింగ్.


ఈ సినిమా తర్వాత  కోలీవుడ్‌లో 'ఆండవన్‌ కట్టళై', 'శివలింగ' వంటి చిత్రాల్లో నటించే అవకాశాలను అందుకుంది. ఆ రెండూ సినిమాలు సక్సెస్‌ అవడంతో కుటుంబ కథా చిత్రాల హీరోయిన్ గా గుర్తింపు పొందింది. అయితే అదే రితికాసింగ్‌కు మైనస్‌ అయ్యిందేమో. అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో గ్లామర్ వైపు టర్న్ తీసుకుంది. రొమాంటిక్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా రెడీ అంటూ రీసెంట్‌గా ఫొటోసెషన్‌ చేయించుకున్న రితిక వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసింది. 


దాంతో కోలీవుడ్‌లో ఒక అవకాశం దక్కించుకుంది. అరుణ్‌ విజయ్‌ రీసెంట్‌గా 'బాక్సర్‌' అనే సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రితికాసింగ్‌ అరుణ్‌కు జంటగా నటిస్తుంది. వివేక్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాక్సింగ్‌ ఇతి వృత్తంతో తెరకెక్కుతోందట. ఈ సినిమాతోనైనా రితిక హీరోయిన్‌గా బిజీ అవుతుందేమో చూడాలి. ఇక రితికా నటించిన 'వడంగాముడి' సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: