ఈ మద్య సోషల్ మీడియాలో ఉన్నది లేనట్లు..లేనిది ఉన్నట్లు అసలు విషయం పక్కన బెట్టి రూమర్లు బాగా వైరల్ అవుతున్నాయి.  స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన న్యూస్ లు, వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. సాధాణంగా మనకు కావాలసిన హీరోలు, హీరోయిన్లు, మోడల్స్ ఇలా ముఖ్యమైన వారి పేర్లు గూగుల్ లో సర్చ్ చేయడం గమనిస్తున్నాం.  ఒక్కపేరు కొడితే చాలు వారికి సంబంధించిన ఫోటోలు అన్నీ వచ్చేస్తుంటాయి. 

తాజాగా ఇదే విషయంపై బాలీవుడ్ నటి అదితి రావు హైదరి  కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది.  2011 లో వచ్చిన 'యే సాలీ జిందగీ' అనే సినిమా తాను సినీ రంగ ప్రవేశం చేశానని..ఆ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టిందని అన్నారు.  ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో కూడా కొన్ని ఛాన్సులు వచ్చాయని అన్నారు.  అప్పట్లో తన గురించి సరదాగా గూగుల్ లో వెతకాలని.. పేరుని సెర్చ్ చేస్తే తాను నటించిన కొన్ని సినిమాల్లో ఫోటోలు పూర్తిగా నగ్నంగా దర్శనమిచ్చాయని తెలిపింది. 

దాంతో ఒక్కసారే షాక్ కి గురయ్యానని.. తన వీపు భాగాన్ని ఎక్స్ పోజ్ చేస్తూ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో నటిస్తే..ఆ ఫోటోలు కాస్త నగ్నంగా మార్ఫింగ్ తో వల్గర్ గా సృష్టించారని బాధపడింది.  అప్పటి నుంచి గూగుల్ లో తన పేరు సర్చ్ చేయాలంటే భయం వేస్తుందని అన్నారు అతిధి.  ప్రస్తుతం  తెలుగులో ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తోన్న 'వి' అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో నాని, సుదీర్ బాబు హీరోలుగా కనిపిస్తున్నారు. అలానే తమిళంలో 'సైకో' అనే మరో సినిమాలో నటిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: