క్రియోటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ పేరు చెప్పగానే నిన్నే పెళ్ళాడతా, అంతపురం, ఖడ్గం, మురారి వంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు గుర్తొస్తాయి. తను ఏ సినిమా చేసిన అందులో సామాజిక అంశం లేదంటే కుటుంబం, బంధాలు..ఇలా ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే సినిమాలు తెరకెక్కిస్తుంటారు. ముఖ్యంగా దేశభక్తి, ఫ్యామిలీ బ్యాగ్డ్రాప్ లో రూపొందించిన సినిమాలన్నీ కృష్ణవంశీకి ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టాయి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది క్రియోటివ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్స్ లో ఉండే మొదటి పేరు కృష్ణవంశీ అని ఖచ్చితంగా చెప్పాలి. 


అలాంటి కృష్ణవంశీ కూడా గొప్ప డిజాస్టర్లను తీశారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమాలు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా 'చక్రం' అయితే రెండవది కృష్ణవంశీ ఎంతో ఇష్టపడి తీసిన 'మహాత్మ'. ఈ సినిమాలో శ్రీకాంత్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమా హీరో శ్రీకంత్ కి 100వ సినిమా కావడం విశేషం. కానీ ఈ సినిమా ఫ్లాప్ గా అటు డైరెక్టర్ కృష్ణవంశీ కి ఇటు హీరోగా శ్రీకాంత్ కి చేదు అనుభవంగా మిగిలిపోయింది. ఇక కృష్ణవంశీ ఎంతో ఇష్టపడి తీసిన మరో సినిమా 'చక్రం'. ఈ సినిమా కథ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా బావున్నప్పటికి.. అప్పటికే ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు చూసేశారు కాబట్టి అంతగా నచ్చలేదు. 


ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాని ఎంతో ప్రేమించి చేశాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. అయితే ఫ్యామిలీ ఆడియన్స్ కి మాత్రం కాస్తో కూస్తో నచ్చిందని చెప్పాలి. అంతేకాదు ఈ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్‌గా అయినప్పటికి టీవీలో మాత్రం ఈ సినిమాను ఎక్కువసార్లు ప్రేక్షకులు చూడటం విశేషం. అయితే ఇలాంటి సినిమాని మాత్రం మళ్ళీ ఎప్పుడు తీయనని కృష్ణవంశీ సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్.    


మరింత సమాచారం తెలుసుకోండి: