తెలుగు ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే.  రాజమౌళి దర్శకత్వంలో చత్రపతి చిత్రంతో వరుస విజయాలు అందుకుంటున్న ప్రభాస్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి2 లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించారు.  ఈ చిత్రాలతో ప్రభాస్ రేంజ్ జాతీయ స్థాయిలో పెరిగిపోయింది.  ఒకదశలో ప్రభాస్ ని బాహుబలి అంటూ తెగ పొగిడేస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాలు ఓ ట్రెండ్ సృష్టించాయంటే ఆశ్చర్యం లేదు.  అలాంటి ప్రభాస్ కి నిన్న మొన్న వచ్చిన ఓ యంగ్ హీరో షాక్ ఇచ్చాడు. 

ప్రతిష్ఠాత్మక టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ టాప్-10లో కేవలం ఒకేఒక్క టాలీవుడ్ హీరోకు మాత్రమే స్థానం లభించింది. టైమ్స్ 2018కి గాను టాప్50 సెలబ్రిటీలతో మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితా విడుదల చేసింది. ఈ లిస్టులో తెలుగు యువ హీరో విజయ్ దేవరకొండ నాలుగోస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో మొదటి స్థానం బాలీవుడ్ నయా సెన్సేషన్ విక్కీ కౌశల్ కు లభించింది. ద్వితీయస్థానంలో భారత ఫుట్ బాల్ ప్లేయర్, మోడల్ ప్రథమేశ్ మౌలింకర్ కు ఉన్నాడు.

మూడో స్థానంలో బాలీవుడ్ యంగ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్ ఉన్నారు. ఆయన తర్వాత స్థానంలో విజయ్ దేవరకొండ ఉన్నారు.  కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు స్థానాలు పతనమై ఫిఫ్త్ ప్లేస్ లో నిలిచాడు. కాగా, టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కు టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో 12వ ర్యాంక్ ఇచ్చారు.  2017 లో ప్రభాస్ కి రెండో జాబితా వచ్చిన విషయం  తెలిసిందే.   గతేడాది 7వ ర్యాంక్ లో ఉన్న రానాకు ఈసారి 19వ ర్యాంక్ ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: