ఈషా రెబ్బా .. పక్కా తెలుగు అమ్మాయి. ఇటీవలే అరవింద సమేత చిత్రంలో ముఖ్యమైన పాత్ర పోషించి ఆకట్టుకుంది. అటుపై వరుసగా పలు క్రేజీ సినిమాలకు సంతకాలు చేసింది. నిడివితో పని లేకుండా జూ.ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ రావడం తనకు గొప్ప మైలేజ్ ని ఇచ్చిందని నిషా తెలిపింది. కెరీర్ లో `అ!` లాంటి విలక్షణమైన చిత్రాల్లో నటించిన ఇషా మునుముందు గ్లామర్ రోల్స్ కి షిఫ్టవుతోంది.


అందుకు తగ్గట్టే మారిన మైండ్ సెట్ ని లేటెస్ట్ ఫోటోషూట్ల ద్వారా ఎలివేట్ చేస్తోంది. ముఖ్యంగా తనలోని అందచందాల్ని అద్భుతంగా ఆవిష్కరించుకునే అవకాశం వస్తే అస్సలు విడిచిపెట్టడం లేదు. సోషల్ మీడియాలో నిరంతం ఏదో ఒక ప్రత్యేకత ఉన్న ఫోటోని షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటోంది. తాజాగా తన పొడుగు కాళ్ల సొగసును ఆవిష్కరిస్తూ కొత్తగా కనిపించింది ఇషా.


బ్లాక్ కలర్ ఛమ్కీల డ్రెస్ లో మతి చెడగొట్టింది. ఇషా లుక్ సంథింగ్ స్పెషల్ .. అంతకుమించి హాట్ అంటూ అభిమానుల నుంచి అప్పుడే ప్రశంసలు కురుస్తున్నాయి. 2018లో సుబ్రమణ్యపురం.. సవ్యసాచి.. అరవింద సమేత చిత్రాల్లో నటించింది. వీటిలో `అరవింద సమేత` మాత్రమే విజయం అందుకుంది. 2019లో ఎస్.ఆర్.కె అనే ఓ కన్నడ చిత్రంలోనూ నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: