అక్కినేని కుటుంబం నుండి వెండి తెరకు పరిచయమైన అక్కినేని అఖిల్ కి ఇప్పటి వరకు సరైన హిట్ పడలేదు . దాదాపు మూడు సినిమాలు చేసినా అవి ఏవీ కూడా అక్కినేని అభిమానులను అలరించలేకపోయాయి. అయినా కానీ అఖిల్ తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాణ సారథ్యంలో ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు.

Image result for akkineni akhil

అయితే ఇక్కడ డైరెక్టర్ భాస్కర్ కి గత కొంత కాలం నుండి సరైన హిట్టు లేకపోయినా ఆయన చెప్పిన కథకు కమిట్మెంట్ అయ్యి డేంజర్ లో ఉన్న కెరియర్ తో ప్రయోగాత్మకంగా సినిమాని ఒప్పుకోవడం ఆశ్చర్యమే అని చెప్పవచ్చు. భాస్కర్ స్క్రిప్ట్ ను నమ్మిన అఖిల్ ఈ నెల 24న సినిమాను లాంచ్ చేయడానికి సిద్దమయ్యాడు. రెగ్యులర్ షూటింగ్ ని జూన్ లో స్టార్ట్ చేయనున్నాడు.

Image result for akkineni akhil

అయితే ఇంకా అఖిల్ సరసన హీరోయిన్ సెట్టవ్వలేదు. కీర్తి సురేష్ ని ఇటీవల ఫైనల్ చేద్దామని అనుకున్నారట. అయితే ఆమె అఖిల్ కంటే పెద్దగా కనిపిస్తుందని వద్దనుకున్నారు. ఇక రశ్మిక మందన్న - కియారా అద్వానీ లాంటి బిజీగా ఉన్న హీరోయిన్స్ ని సెలెక్ట్ చేద్దామనుకుంటే వాళ్లు ఇప్పట్లో దొరికేలా లేరు. ఫైనల్ గా కొత్త హీరోయిన్ నే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. హీరోయిన్ దొరికే వరకు మొదటి షెడ్యూల్ లో అఖిల్ కి సంబందించిన మెయిన్ సీన్స్ ను దర్శకుడు ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా అఖిల్ హీరోయిన్ లేకుండానే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: