Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Tue, Jun 18, 2019 | Last Updated 7:02 pm IST

Menu &Sections

Search

గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"

గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
గ్లామర్ సునామీలో ప్రేక్షకులను గింగరాలు తిప్పనున్న రకుల్ ప్రీత్ సినిమా "దే దే ప్యార్ దే"
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

rakul-glamour-tsunami-de-de-pyar-de

ఉత్తరాది తారలు ఎన్నో ఆశలతో దక్షిణాది సినీరంగాల్లోకి దిగుమతి అవుతూనే - ఏ హీరోయిన్‌ నైనా సరే! ఇక్కడ విజయాలు అందుకున్నా, ఏ స్థాయికి చేరినా బాలీవుడ్‌ కు వెళ్లి పేరు తెచ్చుకోవాలని, హిట్టు కొట్టాలని ఆశగా ఉంటుంది. తమ మాతృభాష లో సినిమా చేయాలని, దేశవ్యాప్తంగా మార్కెట్ ఉన్న బాలీవుడ్ సినిమాల్లో ఒక వెలుగు  వెలిగిపోవాలని వాళ్లు కోరుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఐతే దక్షిణాదిన స్టార్లుగా ఎదిగాక బాలీవుడ్‌ పై తమదైన ముద్ర వేసిన హీరోయిన్లు చాలా తక్కువమంది.

rakul-glamour-tsunami-de-de-pyar-de

సిమ్రాన్, కాజల్ అగర్వాల్, తమన్నా, చార్మీ, హన్సిక-ఇలా చాలా మంది హీరోయిన్లు బాలీవుడ్లో ఆశించిన విజయాలు అందుకో లేకపోయారు. అక్కడ పాగావేయలేక పోయారు రకుల్ ప్రీత్ సింగ్ సైతం ఈ వరసలోకే వస్తుంది. తెలుగులో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ అయిన ఆమె, హిందీ లో రెండు క్రేజీ ప్రాజెక్టుల్లో నటించింది. కానీ అవి నిరాశ కే గురి చేశాయి. అవే యారియాన్ - అయ్యారీ. రెండూ ఫ్లాప్ అయి బాలీవుడ్‌ లో రకుల్‌కు రహదార్లు మూసేశాయి. కానీ కొంచెం విరామం తర్వాత ఆమె ఇంకో పెద్ద సినిమా లో అవకాశాలు పట్టేసింది.

rakul-glamour-tsunami-de-de-pyar-de

అందులో ఒక అవకాసమే "దే దే ప్యార్ దే" సీనియర్ హీరో అజయ్ దేవగణ్ హీరో. అందులో రకుల్‌ ఒక ఆసక్తికర పాత్ర చేసింది. ఇందులో అజయ్ మద్య వయస్కుడిగా, పెళ్లికి ఎదిగిన కూతురు ఉన్న పాత్రలో నతించాడు. తనభార్య నుంచి విడాకులు తీసుకున్న అతడితో యంగ్-గర్ల్ అయిన రకుల్ ప్రీత్ ప్రేమలో పడి కావలసినంత గ్లామర్ వలకబోస్తుంది. తర్వాత అతడి భార్య తిరిగి తన జీవితంలోకి వస్తుంది. ఈ నేపథ్యంలో జరిగే వరుస సంఘటనల సరదా కథ ఇది.

rakul-glamour-tsunami-de-de-pyar-de

నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంపై రకుల్ ప్రీత్ చాలా ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలు ఫలించే లాగే కనిపిస్తున్నాయి. ముందు రోజు ముంబయి లో క్రిటిక్స్, సినీ ప్రముఖులకు ప్రివ్యూ షో వేయగా, టాక్ అదిరిపోయింది. ప్రముఖ క్రిటిక్, ట్రేడ్ అనలిస్ట్ ఈ చిత్రానికి 4 స్టార్ రేటింగ్‌‌ తో పాజిటివ్ రివ్యూ ఇచ్చాడు. మిగతా రివ్యూలు కూడా పాజిటివ్‌ గానే ఉన్నాయి.

rakul-glamour-tsunami-de-de-pyar-de

సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా సాగినట్లు చెబుతున్నారు. రకుల్ ప్రీత్ యాక్టింగ్, గ్లామర్ గురించి అద్భుతంగా ప్రశంసలు కురిపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్లో హిట్ కొట్టాలన్న ఎన్నో ఏళ్ల రకుల్ ప్రీత్ సింగ్ కల తీరబోతున్నట్లే ఉంది.

 CRITICS Rating 4/5

rakul-glamour-tsunami-de-de-pyar-de

rakul-glamour-tsunami-de-de-pyar-de
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జపాన్ వాళ్ళంతే - మిర్రర్ న్యూరాన్ల స్పందన ఎక్కువట? అందుకే అలా తయారయ్యారు!
షాకింగ్! బీజేపిలోకి సుజానా!
గోవు పరమ పవిత్రం - గోవు వలన ప్రయోజనాలు
ఎడిటోరియల్: దేశంలో ఏ ఇతర నాయకునికి లేని ఆ రోగమే చంద్రబాబు కొంప ముంచింది?
సండే స్పెషల్: చీరకట్టు - కనికట్టు - చీరలో మన హీరోయిన్స్
పదవి పోయినా ఆ ఫోజు మారలేదు - ఇంగువ కట్టిన గుడ్డ వాసన పోనట్లు - టిడిపి గతి అంతే!
ఏపికి ప్రత్యేక హోదా అత్యవసరం, ఇచ్చి ఆదుకోండి : సీఎం వైఎస్ జగన్
పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి “పవన”మో! పలాయనమో!
"షా" వెరైటీ మామిడి పండు - అమృతఫలం రుచి, రూపం, బరువు అద్భుతం
ఈ పిల్ల అందాలకు జిమ్ బయట ఇంటి బయట కాపలా పెట్టాల్సిందే!
తెలంగాణాలో బీజేపి విజృంభణ - రాంమాధ‌వ్ నేతృత్వంలో 'ఆపరేషన్ కమలం'!
అబద్ధాలు-చంద్రబాబు-చరిత్రవక్రీకరణ - కవలపిల్లలు
About the author

NOT TO BE MISSED