Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 3:57 am IST

Menu &Sections

Search

ఆ విధంగా చూస్తే అఖిల్-భాస్కర్ ల మూవీ హిట్టేనట...!!

ఆ విధంగా చూస్తే అఖిల్-భాస్కర్ ల మూవీ హిట్టేనట...!!
ఆ విధంగా చూస్తే అఖిల్-భాస్కర్ ల మూవీ హిట్టేనట...!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
అక్కినేని వారబ్బాయి అఖిల్ నిజానికి తన చిన్నతనంలోనే సిసింద్రీ సినిమాతో సినిమాల్లోకి ప్రవేశించాడు. అయితే ఆ తరువాత పెద్దయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చింది మాత్రం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అఖిల్ మూవీతోనే. నిజానికి ఎన్నో అంచనాల మద్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని అందుకుంది. అనంతరం అఖిల్ 24 మూవీ ఫేమ్ విక్రమ్ కుమార్ కు హలో సినిమాతో అవకాశం ఇచ్చాడు. అయితే అది పర్వాలేదనిపించినా, ఆయనకు ఆశించిన ఫలితాన్ని అయితే ఇవ్వలేకపోయింది.


అనంతరం వరుణ్, రాశి లతో కలిసి హృదయానికి హత్తుకునే ప్రేమకథగా వచ్చి మంచి సక్సెస్ అందుకున్న తొలిప్రేమ వంటి విజయవంతమైన చిత్రాన్ని తీసిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో మిస్టర్ మజ్ను అనే సినిమాలో నటించాడు అఖిల్. అయితే దాని ఫలితం కూడా ఆయనకు పెద్దగా ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం అయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తదుపరి సినిమాను చేయనున్న విషయం తెలిసిందే. గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై ఈ చిత్రం ఈనెల 24న ప్రారంభోత్సవాన్ని జరుపుకోనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా విషయమై ఒక ఆసక్తికరమైన చర్చ టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. 


అది ఏంటంటే, అఖిల్ ఇదివరకు చేసిన మూడు సినిమాలు హిట్ దర్శకులతోనే చేసినప్పటికీ ఫలితం లేదు. అయితే అప్పుడెప్పుడో రామ్ చరణ్ తో ఆరంజ్, ఆపై రామ్ హీరోగా వచ్చిన ఒంగోలు గిత్త వంటి అట్టర్ ఫ్లాప్ చిత్రాలను తీసి చాలా ఏళ్ల పాటు టాలీవుడ్ నుండి కనుమరుగైన భాస్కర్, మళ్ళి ఇన్నేళ్లకు అఖిల్ తో సినిమా నిర్మిస్తుండడంతో ఈ సినిమా విజయం ఖాయమని అంటున్నారు.

నిజానికి ఆ ముగ్గురు హిట్ దర్శకులు అఖిల్ కు సరైన సక్సెస్ ఇవ్వలేకపోయారని, అయితే వరుస ఫ్లాప్ లతో సతమతం అవుతున్న భాస్కర్ ఖచ్చితంగా ఈసారి అఖిల్ కు మంచి సక్సెస్ ఇచ్చి తీరుతాడని, ఇక ఈ సినిమాతో ఈ ఇద్దరికీ మంచి బ్రేక్ రావడం ఖాయమని అంటున్నారు. అయితే ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో ప్రచారమవుతున్న ఈ వార్త ఒకవేళ అఖిల్, భాస్కర్ విషయంలో నిజం అయితే మాత్రం వారిద్దరికీ కెరీర్ పరంగా మంచి బూస్ట్ వచ్చినట్లే మరి...!!! 


hero-akhil
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author

Most of us are not even aware of that voice that lives inside us, viciously so. Unfortunately, I have been in a long-term abusive relationship with my Inner Critter for years. My Inner Critter poses as an Ivy League tweed-clad professor, and I tend to assign immediate power to anyone boasting to have a "smart" bespectacled academic Joycean opinion, especially about writing.