సాధారణంగా సినిమా హీరోయిన్లు వచ్చామా..నటించామా..రెమ్యూనరేషర్ తీసుకున్నామా..మరో సినిమాకు కమిట్ అయ్యామా అనే విధంగా సాగుతుంటారు.  మరికొంత మంది హీరోయిన్లు సెట్లో ఉన్నవారితో సందడిగా ఉంటూ..సినిమా పూర్తయ్యాక తనతోపాటు చేసిన ప్రతిఒక్కరికీ ఎదో ఒక ట్రీట్ ఇవ్వడం చూస్తుంటాం.  ఆ మద్య కీర్తి సురేష్ తన సినిమా షూటింగ్ పూర్తయ్యాక చిత్ర యూనిట్ లో ఉన్నవారికి గ్రామ్ బంగారు బిస్కెట్ ఇచ్చి సంతోష పరిచింది.  


తాజాగా ఇప్పుడు నటి రాశీ ఖన్నా చేసిన పనికి చిత్ర యూనిట్ మాత్రమే కాదు అభిమానులు కూడా తెగ మెచ్చుకుంటున్నారు.  అసలు విషయానికి వస్తే..ఎన్టీఆర్‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన టెంప‌ర్ చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి కొత్త దర్శకుడు, ఏఆర్‌.మురుగదాస్‌ శిష్యుడు వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  ఈ సినిమాలో విశాల్ నటనకు తమిళ తంబీలు తెగ సంబర పడిపోతున్నారు.  


అయితే ఈ సినిమా పూర్త‌య్యాక వచ్చే ఎండ్ టైటిల్స్ లో వాయిస్ ఆర్టిస్టులకు క్రెడిట్స్ ఇవ్వలేదు. దీనిపై రాశీ ఖ‌న్నాకి డ‌బ్బింగ్ చెప్పిన డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ ర‌వీనా ఎస్‌.ఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా ఆవేద‌న వ్య‌క్తం చేసింది.   అయోగ్య సినిమా పూర్తైన త‌రువాత వ‌చ్చే ఎండ్ టైటిల్స్‌లో డ‌బ్బింగ్ ఆర్టిస్టుల పేర్లు లేక‌పోవ‌డం బాధ‌గా ఉంది.  చాలా సార్లు మా కేట‌గిరికి క్రెడిట్స్ ఇవ్వ‌క‌పోవ‌డం బాధ క‌లిగిస్తోందని ట్వీట్ చేశారు ర‌వీనా.


 దీనిపై వెంటనే రాశీఖన్నా స్పందించి..నన్ను క్ష‌మించు ర‌వీనా. స్క్రీన్ మీద న‌న్ను ఎలివేట్ చేయ‌డానికి అంద‌మైన గొంతు ఇచ్చిన మీకు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు అని పేర్కొంది. అయితే ఓ టాప్ హీరోయిన్ గా చెలామని అవుతున్న రాశీఖన్నా తన డబ్బింగ్ ఆర్టిస్ట్ పట్ల ఇంత ఉదాసీనత చూపించడం..ఎంతో సంతోషించదగ్గ విషయం అని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: