మెగా పవర్ స్టార్ రాం చరణ్-జెనీలియా జంటగా నటించిన 'ఆరెంజ్' సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాలో రాం చరణ్ ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఎప్పటికప్పుడు మారుతుందని..ఏవరినీ లైఫ్ లాంగ్ ప్రేమించడం కుదరదని అలా అనుకోవడం అంతా ట్రాష్ అని చెప్తాడు. ఇప్పుడు అదే విషయాన్ని మరో యువ జంట కూడా చెబుతోంది.


శ్రీనిక క్రియేటివ్ వ‌ర్క్స్ నిర్మాణంలో శ్రీ ప‌వార్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం `2 అవ‌ర్స్ ల‌వ్‌`. కృతి గార్గ్ హీరోయిన్‌ నటించింది. ఇప్ప‌టి వ‌ర‌కు చాలా ప్రేమ క‌థ‌ల‌ను ప్రేక్ష‌కులు చూసుంటారు. కానీ స‌రికొత్త ప్రేమ క‌థాంశంతో `2 అవ‌ర్స్ ల‌వ్` చిత్రం తెర‌కెక్కుతోంది. ప్ర‌స్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. అస‌లు ఈ రెండు గంట‌ల ప్రేమ ప్ర‌యాణ‌మేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే అంటున్నారు హీరో, ద‌ర్శ‌కుడు శ్రీప‌వార్‌.


స‌రికొత్త ల‌వ్ కాన్సెప్ట్‌తో '2 అవ‌ర్స్‌ ల‌వ్‌'చిత్రాన్ని తెర‌కెక్కించాం. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వ‌చ్చింది. ఇద్ద‌రు ప్రేమికుల మ‌ధ్య ప్రేమ‌లో వ‌చ్చే స‌మ‌స్య‌లు ఎలా ఉంటాయ‌నే విష‌యాన్ని మా సినిమాలో చూపించాం. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌. హార్ట్ ట‌చింగ్ ఎమోషన్స్ ఉంటాయి. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. త్వరలోనే సినిమా ట్రైల‌ర్‌ను. సినిమా విడుద‌ల తేదిని ప్ర‌క‌టిస్తాం అన్నారు చిత్ర బృందం. అయితే సరికొత్త కాన్సెప్ట్ అని చెబుతున్నప్పటికి ఈ సినిమాలో 'ఆరెంజ్' ఛాయలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: