జెర్సీ సినిమా హిట్ తో మంచి జోష్ మీద ఉన్నాడు న్యాచురల్ స్టార్ నాని. తన కెరీర్లో ఎన్నడూ లేనివిధంగా జెర్సీ సినిమా మంచి హిట్ అవడంతో ఫుల్ ఖుషి మీద ఉన్న నాని తన తర్వాత సినిమా షూటింగ్లో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం నాని గ్యాంగ్ లీడర్ అనే సినిమా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై చేస్తున్నారు.

Related image

ఈ సినిమాలో నాని పక్కన హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. అంతేకాకుండా ఈ సినిమా లో బ్లాక్ బస్టర్ RX 100 మూవీ కథానాయకుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటించడం విశేషం. సీనియర్ లక్ష్మి, శరణ్య, వెన్నెల కిషోర్, రఘు బాబు, ప్రియదర్శి, సత్య ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

Image result for gang leader nani

అనిరుథ్ రవిచందర్ సంగీతం అందించారు. సీనియర్ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ PC శ్రీరామ్ గ్యాంగ్ లీడర్ మూవీ కి వర్క్ చేస్తున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గ్యాంగ్ లీడర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 30 వ తేదీ రిలీజ్ కానుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు. బ్లాక్ బస్టర్ మూవీ జెర్సీ తరువాత హీరో నాని నటించే గ్యాంగ్ లీడర్ మూవీ పై అంచనాలు భారీగా ఉన్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: