ప్రస్తుతం తెలుగు సినిమా రంగంలో సంగీత దర్శకుల మధ్య కోల్డ్ వార్ సాగుతున్నట్లు సోషల్ మీడియాలో బీభత్సమైన ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలో చాలామంది సంగీత దర్శకులు ఉన్నా పోటీ మాత్రం దేవి శ్రీ ప్రసాద్ మరియు తమన్ మధ్య మాత్రమే. వరుస పెట్టి సినిమాలకు మ్యూజికల్ హిట్స్ ఇవ్వడం వీరిద్దరికి మాత్రమే చెందుతుంది. ఇండస్ట్రీలో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ ఉన్న ఒక సినిమా హిట్ ఇచ్చిన మరొక సినిమాతో బోల్తా పడి పోతూ ఉంటారు. కానీ దేవీశ్రీ ప్రసాద్ తమన్ ల మధ్య పోటా పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇంతకీ అసలు విషయంలోకి వెళితే మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాకు రెండు పాటలు మినహా పెద్ద అవుట్పుట్ సరిగ్గా ఇవ్వలేదు దేవి.
Image result for devi thaman
దీంతో చాలామంది మహేష్ అభిమానులు దేవీశ్రీప్రసాద్ సంగీతం పట్ల బహిరంగంగానే సినిమా రిలీజ్ అవ్వకముందు సోషల్ మీడియాలో కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ క్రమంలో త్వరలో మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్న దానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం గ్యారెంటీ అన్న వార్తలు వినపడుతున్న క్రమంలో ...ఓ మహేష్ అభిమాని ఈ సినిమాకు మాత్రం దేవిని కాకుండా తమన్ ని తీసుకోమని సూచిస్తూ దూకుడు తాలుకు ఇంట్రో క్లిప్ కూడా అందులో పొందుపరిచాడు.
Image result for devi thaman
ఆ కామెంట్ లో దేవిని కొంచెం ఘాటుగానే కౌంటర్ చేశాడు సదరు ఫ్యాన్. దీనికి తమన్ లైక్ కొట్టేశాడు. అంటే అతని అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు చెప్పినట్టే. ఇది కాస్తా దేవి అభిమానుల కంటబడింది. వాళ్ళూ తమన్ ఫెయిల్ అయిన క్లిప్స్ తో కౌంటర్ ఇచ్చే పనిలో పడ్డారు. ఏది ఏమైనా ఒక చిన్న లైక్ ఒకోసారి చాలా దూరం వెళ్ళిపోయి ఎన్నో రకాల అర్థాలు ఇస్తుంది. అయితే తమన్ అనుకోకుండా లైక్ కొట్టాడో లేకపోతే కావాలని కొట్టాడో ఎవరికి అర్థం కావటం లేదు. అయితే ప్రస్తుత పరిణామాలను బట్టి చూస్తుంటే సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: