సినిమా రంగం పూర్తిగా సెంటిమెంట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. ఇక్కడ హిట్ కంటే మంచి మంత్రం లేదు. అందరూ లక్కునే నమ్ముతారు. ఓ పెయిర్ తో హిట్ కొడితే దాన్ని కంటిన్యూ చేస్తారు. ఖర్మ కాలి ఫ్లాప్ వస్తే అంతే ఎంత మంచి పెయిర్ అయినా అక్కడితో ఆగిపోతుంది. ఇలాంటివి అన్న గారి రోజుల  నుంచి ఎన్నో జరిగాయి. జరుగుతూనే ఉంటాయి. ఇపుడు ఆ  నుంచి యాంటి  సెంటిమెంట్ పెయిర్ మరో మారు జత కడుతోందని  టాక్.


ఇదంతా ఎందుకంటే అప్పుడెపుడో అంటే కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నాగ చైతన్యతో ఓ సినిమా చేసింది. ఆ సినిమాను అజయ్ భూయన్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీకి దడ అని పేరు పెట్టారు. ఈ మూవీ నాగ చైతన్య యాక్షన్ మూవీ. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. దాంతో నాగ చైతన్య మళ్ళీ కాజల్ తో మరో సినిమా చేయలేదు. ఈ సినిమా 2011లో వచ్చింది. అంటే ఇప్పటికి ఎనిమిదేళ్ళు అయింది. అయినా ఈ జోడీ మళ్ళీ కుదరలేదు.


ఫ్లాప్ కి అనేక  కారణాలు ఉన్నా తమ జంటకు జనాదరణ లేదని చైతూ ఫీల్ అయి కాజల్ ని దూరం పెట్టారని అంటారు. ఈ మధ్యలో కాజల్ అందరి హీరోలతో నటించి టాప్ హీరోయిన్ అయింది. ఇపుడు సీత పేరు మీద లేడీ ఓరిఎంటెడ్ మూవీ చేస్తోంది. మరో వైపు నాగ చైతన్య మజిలీ హిట్ తో  హుషార్ గా ఉన్నాడు. మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాడు. అయితే ఈ ఇద్దరినీ కలిపి ఓ మూవీ తీయాలని ప్లాన్ చేస్తున్నారుట. చైతూ కాజల్ కాంబోతో మంచి హిట్ కొట్టి యాంటీ సెంటిమెంట్ ని తిరగరాలని అనుకుంటున్నారుట. మరి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: