బాహుబలి తరువాత అనుష్క సినిమాలు చాలా వరకు తగ్గించేసింది.  గతంలో వరుసగా సినిమాలు చేసిన అనుష్క, ఇప్పుడు చాలా సెలెక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటోంది.  భాగమతి తరువాత సినిమా చేయలేదు.  ఈ సినిమా మంచి విజయం సాధించింది.  


బాహుబలిలో కొద్దిగా లావుగా కనిపించిన ఈ భామ, ఆ సినిమా తరువాత కొద్దిగా వెయిట్ తగ్గి తిరిగి తన పూర్వ స్థితికి వచ్చింది.  ప్రస్తుతం సైలెన్స్ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తోంది.  మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 24 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది.  ఎక్కువ భాగం అమెరికాలోనే షూట్ ఉంటుంది.  


ఎన్నారై బిజినెస్ విమెన్ గా అనుష్క కనిపిస్తుండటం విశేషం.  ప్రస్తుతం అనుష్క చేతిలో ఉన్న సినిమా ఇదొక్కటే.  ఈ సినిమా తరువాత నెక్స్ట్ చేయబోయే సినిమా ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.  కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకూడదని నిర్ణయించుకున్న అనుష్క, దానికి అనుగుణంగానే సినిమాలు ఎంచుకోవడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: