అల్లు శిరీష్ హీరో గా నటించిన సినిమా ఏబిసిడి నిన్న ప్రేక్షుకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా హిట్ అవ్వటానికి మంచి స్కోప్ ఉన్న సబ్జెక్టు అయినప్పటికీ ఒరిజినల్ సినిమా కు ఈ సినిమాలో మార్పులు చేయటం. అలాగే హీరో అయినా శిరీష్ కూడా తన నటనతో సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకొనిపోయే స్టామినా లేకపోవటం మొదటి మైనస్ గా చెప్పాలి. సన్నివేశ బలం లేని చోట దానిని నిలబెట్టే ఆర్టిస్టులు అవసరం.


అందుకు వెన్నెల కిషోర్‌పై తీసిన సన్నివేశాలే సాక్ష్యం. చాలా సందర్భాలలో బలహీనంగా అనిపించే కథ, కథనాలున్న ఏబిసిడిని అల్లు శిరీష్‌ ఎటువంటి ఎక్స్‌ట్రా ఎఫర్ట్స్‌తో సపోర్ట్‌ చేయలేకపోయాడు. ఎనర్జీతోనే కొన్ని సన్నివేశాలకి, తద్వారా సినిమాలకి బలంగా ఎలా మారవచ్చు అనేదానికి తన ఇంట్లోనే బోలెడన్ని ఉదాహరణలు. టైమింగ్‌ వున్న భరత్‌కి నవ్వించడానికి తగిన డైలాగులు, సన్నివేశాలు క్రియేట్‌ చేయలేదు.


రుక్షర్‌ క్యారెక్టర్‌ స్టాక్‌ క్యారెక్టర్‌లా వుంటుందే తప్ప కథకి ఎక్కడా దోహదపడదు. తెర వెనుక నుంచి కూడా ఈ చిత్రానికి అదనపు అండదండలు లభించలేదు. సిడ్‌ శ్రీరామ్‌ పాట మినహా చెప్పుకోతగ్గ అడిషినల్‌ బెనిఫిట్స్‌ లేవు. నిర్మాణ పరంగా వున్న లిమిటేషన్స్‌తో కొన్ని కీ క్యారెక్టర్స్‌ని ఎవరెవరితోనో చేయించేయడం వల్ల చాలా సన్నివేశాలు తేలిపోయాయి. ఒరిజినల్‌ని మార్చాలని, శిరీష్‌ని అల్టిమేట్‌గా హీరోలా చూపించాలని చేసిన ప్రయత్నం వల్ల ఏబిసిడి అనే ఇంట్రెస్టింగ్‌ స్టోరీ కన్‌ఫ్యూజన్‌లో పడి చాలా రొటీన్‌ సినిమాగా ఎండ్‌ అయింది. ఈ కన్‌ఫ్యూజన్‌తో బాక్సాఫీస్‌ని గెలవడం అంత తేలిక ఏమీ కాదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: