ప్రస్థుతం యూత్ కు ఐకాన్ గా విజయ్ దేవరకొండ మారిపోయాడు. ఇలాంటి పరిస్థుతులలో విజయ్ మ్యానియాను తమకు అనుకూలంగా ఉపయోగించు కోవడానికి ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ప్రయత్నిస్తూ విజయ్ ను తమ సినిమా ఫంక్షన్స్ కు అతిధిగా పిలిచి అతడి అభిమానుల సపోర్ట్ తో తమ సినిమాలకు విజయ్ అభిమానుల సపోర్ట్ దొరికేలా వ్యూహాలు రచిస్తున్నారు.

విజయ్ దేవరకొండ కూడ తన స్టార్ ఇమేజ్ ని పక్కకు పెట్టి తనను అతిధిగా పిలిచిన సినిమా ఫంక్షన్స్ కు వెళుతూ తన ఇగోను పక్కకు పెట్టి టాప్ హీరోలు చిన్న హీరోలు అన్న తేడా లేకుండా అందర్నీ ప్రశంసిస్తూ తాను అందరి వాడిని అన్న ముద్ర వేయించుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ విషయమై ఒక నెగిటివ్ సెంటిమెంట్ ప్రచారంలోకి రావడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

విజయ్ దేవరకొండను అతిధిగా ‘సవ్యసాచి’ ‘సూర్యకాంతం’ ‘నువ్వుతోపురా’ ‘మహర్షి’ సినిమాల ఫంక్షన్స్ కు పిలిచారు. విజయ్ కూడ ఈ సినిమాల ఫంక్షన్స్ కు అన్నింటికి వెళ్ళి ఆమూవీలో నటించిన హీరో హీరోయిన్స్ ను పెద్ద చిన్న అన్న తారతమ్యం చూపించ కుండా అందర్నీ తెగ పొగిడాడు. అయితే ఈసినిమాలు అన్నింటికి విమర్శకుల నుండి ప్రశంసలు లభించాయి కానీ కమర్షియల్ సక్సస్ అందుకునే విషయంలో వెనకపడ్డాయి. ఈ లిస్టులో ‘మహర్షి’ కూడ చేరడం అత్యంత ఆశ్చర్యకరం. 

‘మహర్షి’ మౌత్ టాక్ లో సూపర్ హిట్ కలక్షన్స్ విషయంలో కన్ఫ్యూజన్ అన్న పద్దతిలో ప్రస్తుతం రన్ అవుతోంది. దీనికితోడు ‘మహర్షి’ తో నష్టాలు లేకుండా బయ్యర్లు బయట పడతారా అన్న కన్ఫ్యూజన్ కూడ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థుతులలో విజయ్ దేవరకొండ అతిధిగా వచ్చినా అతడి గోల్డెన్ లెగ్ ఈసినిమాలను కాపాడలేకపోయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ప్రస్తుతం విజయ్ దేవరకొండ పేరు చెపితే హీరోలు భాపదిపోతున్నారు అంటూ ఒక ప్రముఖ ఛానల్ ప్రసారం చేసిన ఆసక్తికర కథనం టాలీవుడ్ లో మరో కొత్త సెంటిమెంట్ ను క్రియేట్ చేస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: