పై ఫోటో చూశారు కదా..ఇది ఓ ముప్పై ఏళ్ల కిందటి ఫోటో.. ఫోటోలో ఓ పాపకు డాక్టర్ ట్రీట్ మెంట్ చేస్తుంటే.. పక్కనే అమితాబ్ బచ్చన్.. ఆమెకు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. పాప మాత్రం బిక్క మొహం వేసుకుని బాధతోనే ఉంది. 


ఇంతకీ ఈ పాప ఎవరో తెలుసా.. ఇప్పుడు ఈ పాప.. బాలీవుడ్ ఇండస్ట్రీనే ఓ ఊపు ఊపేస్తోంది. బాలీవుడ్‌లో కపూర్‌ ఫ్యామిలీకి చెందిన ఈ అమ్మాయి.. పుకార్ సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫోటో ఇది. ఈ సినిమా షూటింగ్‌కు ఆ పాప వచ్చింది.

ఆ సమయంలో కాలికి చిన్న గాయం అయ్యిందట. వెంటనే డాక్టర్ ను పిలిపించి.. గాయం శుభ్రం చేసి..మందురాసి బ్యాండేజ్ వేశారట. ఈ జ్ఞాపకాన్ని ఇటీవల అమితాబ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇంతకీ ఆ పాప ఎవరో చెప్పలేదు కదూ.. తనే కరీనా కపూర్‌.

కపూర్ ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. హీరోలనే కాదు హీరోయిన్లనూ అందించిన ఫ్యామిలీ ఇది. మొదట్లో కరిష్మా కపూర్‌.. ఆ తర్వాత ఆమె చెల్లి కరీనా కపూర్‌ బాలీవుడ్ ను ఊపేశారు. కరీనా అక్కకంటే ఎక్కువ కాలమే స్టార్ డమ్ అనుభవిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: