టాప్ హీరోల పై వారి అభిమానులకు ఉండే విపరీతమైన అభిమానం ఎలాంటి అయోమయాన్ని సృష్టిస్తుందో మరొకసారి రుజువైంది. ‘మహర్షి’ మూవీ సక్సస్ అవ్వడంతో విపరీతమైన జోష్ లో ఉన్న మహేష్ అభిమానులు అత్యుత్సాహంతో పవన్ అభిమానులను కెలకడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ వరసగా సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలను చేస్తున్న విషయాలను వివరిస్తూ మహేష్ రియల్ హీరో అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు. 

అదే సమయంలో కొంతమంది మహేష్ అభిమానులు పవన్ కళ్యాణ్ ఇలాంటి సినిమాలు ఎందుకు చేయడు అంటూ ప్రశ్నలు కూడ వేస్తున్నారు. పవన్ గతంలో నటించిన ‘అత్తారింటికి దారేది’ ‘గబ్బర్ సింగ్’ ‘అజ్ఞాతవాసి’ సినిమాల గురించి ప్రస్తావన చేస్తూ పవన్ సమాజానికి సందేశం ఇచ్చే సినిమాలలో ఎందుకు నటించడు అంటూ మహేష్ అభిమానులు పవన్ అభిమానులను కార్నర్ చేస్తూ సోషల్ మీడియాలో వేస్తున్న ప్రశ్నలు పవన్ అభిమానులకు తలనొప్పిని తెచ్చి పెడుతున్నాయి.  

అంతేకాదు చాలమందిలా పెద్దపెద్ద మాటలు చెప్పకుండా సైలెంట్ గా సమాజానికి ఎదో ఒకటి చేయాలనే తపన ఉన్న వ్యక్తి మహేష్ మాత్రమే అంటూ మరో ఊహించని ట్విస్ట్ ఇస్తున్నారు మహేష్ అభిమానులు. అంతేకాదు మహేష్ తాను ‘శ్రీమంతుడు’ సినిమాలో నటించిన పాత్రను ప్రాతిపదికగా తీసుకుని మహేష్ తన సొంత ఊరును దత్తత తీసుకుని డెవలప్ చేసిన గొప్ప వ్యక్తి అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు ప్రిన్స్ అభిమానులు.

మహేష్ సొంత బావ గల్లా జయదేవ్ ఎన్నికలలో పోటీ చేసినా తమ హీరో ఎక్కడా తన బావకు ఓట్లు వేయమని అడగలేదనీ అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన అన్న
నాగబాబును ఎన్నికల పోటీలో నిలిపి అతడి విజయం కోసం ప్రచారం చేయడమే కాకుండా కుటుంబ వారసత్వ రాజకీయాలకు ప్రోత్సాహం ఇస్తున్నాడని కొందరు మహేష్ అభిమానులు వేస్తున్న సెటైర్లు పవన్ వీరాభిమానులకు తీవ్ర కోపాన్ని తెప్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో పవన్ అభిమానులు మహేష్ అభిమానులను తమ కామెంట్స్ తో ఇరుకున పెట్టడానికి అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. రాజకీయాలకు దూరంగా ఉండే మహేష్ అనవసరంగా అతడి అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇరుకున పడటం హాట్ టాపిక్ గా మారింది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: