అంతేగా.. అంతేగా.. ఇటీవలి కాలంలో ఇంతగా పాపులరై జనం నోళ్లలో నానిన తెలుగు సినిమా డైలాగ్ ఇదే.. సెటైర్ గా ఉంటూ.. ప్రతి ఒక్కరికీ ఎప్పుడో ఓసారి పలకాల్సిన డైలాగ్ ఇది. అంతేగా.. అంతేగా.. అంటూ జనం బాగా కనెక్టయ్యారు. 


ఈ డైలాగ్ చెప్పిన ప్రదీప్ ఈ సినిమాలో డమ్మీ భర్తగా కామెడీ పండించినా.. ఈయన ఒకప్పుడు అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టిన అందగాడే. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో తన జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన అచ్చు కమల్ హాసన్‌ లా ఉండేవారట. 


జంధ్యాల గారితో  మొదటి సినిమాగా 'ముద్దమందారం' చేశాడు. ఆ సినిమా  100 రోజులు ఆడింది. ఆ తరువాత 'నాలుగు స్థంభాలాట' చేశాడు. అది 175 రోజులు ఆడింది. ఆ తర్వాత 'రెండు జెళ్ల సీత' కూడా సూపర్ హిట్ అయింది. 


వరుసగా ప్రేమకథా చిత్రాలు చేయడం .. అవి భారీ విజయాలను అందుకోవడంతో ప్రదీప్‌కు విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. మహిళా అభిమానుల్లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిందట. ఆ ప్రభావంతో ఆయనకు  ప్రతి రోజు నాకు బస్తాల కొద్దీ లవ్ లెటర్స్ వచ్చేవట. అదీ అంతేగా నటుడి ప్రేమలేఖల కథ. 



మరింత సమాచారం తెలుసుకోండి: