శ్రీదేవి, బోనీ కపూర్ల ముద్దులు కూతురు జాన్వీ కపూర్ ధడక్ అనే సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కరణ్ జోహార్ దర్శక నిర్మాణంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం తక్త్ తో పాటు ఐఏఎఫ్ విమానం నడిపిన తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా జీవితమాధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తుంది జాన్వీ. గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ నటిస్తుండగా, ఆమె సోదరుడి పాత్రలో అంగడ్ బేడీ నటిస్తున్నారు. ఇక శ్రీదేవి ఉన్నపుడు చాలా అరుదుగా బయట కనిపించేది జాన్వీ కపూర్.
అమ్మ చాటు కూతురుగానే ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం రోజురోజుకీ రెచ్చిపోవడం అలవాటు చేసుకుంటుంది జాన్వీ కపూర్. ఇక ఇప్పుడు హాట్ క్యాస్ట్యూమ్లో కూడా ఓ రేంజ్లో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు అందాలు ఆరబోసే పనిలో బిజీ అయిపోయింది జాన్వీ కపూర్. ధడక్ తర్వాత వరసచిత్రాలతో బిజీగా ఉంది జాన్వీ కపూర్.
ఆ మద్య ఎక్కడికి వెళ్తున్నా మీరు ఫోటోలు తీస్తున్నారు... కాబట్టి మీ కోసమే ఇలాంటి బట్టలు వేసుకుంటున్నాను అంటూ హాట్ కామెంట్స్ చేసింది జాన్వీ కపూర్. మొత్తానికి ఇలా ఎప్పటికప్పుడు అందాలు ఆరబోస్తూ.. మరొక్క హిట్ కానీ కొట్టిందంటే శ్రీదేవి కోరుకున్నట్లు జూనియర్ శ్రీదేవి చక్రం తిప్పడం ఖాయం,