రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  శివ సినిమాతో సంచలన విజయం అందుకున్న వర్మ ఆ తరువాత అదే తరహా సినిమాతో ఆకట్టుకున్నాడు.  టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వెళ్లి అక్కడ తన హవా కొనసాగించాడు.  ముఖ్యంగా వివాదాస్పద కథలను ఎంచుకోవడం వాటిని సినిమాగా మలచడం వర్మకు వెన్నతో పెట్టిన విద్య.  అందుకే వర్మ సినిమా అనే సరికి అందరిలోనూ తెలియని ఆసక్తి క్రియేట్ అవుతుంది.

మియా మాల్కోవా పేరుతో వర్మ చేసిన షార్ట్ ఫిల్మ్ ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లదు.  చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరేమనుకున్నా సూటిగా చెప్పడం వర్మ తత్త్వం.  లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలోనూ అదే ఫాలో అయ్యాడు.  అందుకే చిక్కుల్లో చిక్కుకున్నాడు.  ఇది వేరే విషయం అనుకోండి.  రెండేళ్ల క్రితం వర్మ తన యూట్యూబ్ ఛానలైనా వర్మ ఫ్యాక్టరీలో ది ఫారినర్ అనే షార్ట్ ఫిలిం ను అప్లోడ్ చేశాడు.  రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.  


ఇందులో నటించిన సాషా జుర్కో రీసెంట్ గా వర్మను ఓ హోటల్ లో కలిసింది.  ఆమెతో కలిసి వర్మ ఫోటో దిగి ఆ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ది ఫారినర్ షార్ట్ ఫిల్మ్ రెండు కోట్లకు పైగా వ్యూస్ రావడానికి ఆ తానే కారణం అని మెసేజ్ ను పోస్ట్ చేశాడు.  తరుణా కంగన్ వాల్ దర్శకత్వం వహించిన 16 నిమిషాల షార్ట్ ఫిలిం ను వర్మ తన ఫ్యాక్టరీ ఛానల్ ద్వారా ప్రమోట్ చేశాడు.  


అందులో నటించిన సాషాను చూసి వర్మ టెంప్ట్ అయ్యాడట.  తన అందానికి, అభినయానికి ముగ్దుడైనట్టు వర్మ తెలిపాడు.  అందాలను అద్భుతంగా చూపించడంలో వర్మ సిద్ధహస్తుడు అనే విషయం అందరికి తెలిసిందే కదా మరి. ఈ షార్ట్ ఫిలిం లో గ్లామర్ డోస్ కాస్త ఎక్కువైనా... మంచి మెసేజ్ ఉండటంతో వ్యూయర్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: