టాలీవుడ్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌కు - క‌మెడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డికి మ‌ధ్య గ‌తంలో బ‌ల‌మైన అనుబంధం ఉండేది. ఇక అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా ముందు వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీ‌నివాస‌రెడ్డి పెద్ద‌గా క‌నిపించ‌లేదు. వీరిద్ద‌రి మ‌ధ్య కొన్ని కార‌ణాల వ‌ల్ల, కొంద‌రి వ‌ల్ల ఏర్ప‌డిన గ్యాప్‌తో అపార్థాలు కొన‌సాగాయ‌ట‌. ద‌ర్శ‌కుడు త్రివ‌క్ర‌మ్ శ్రీ‌నివాస్ వీరి మ‌ధ్య స‌ర్ది చెప్పాకే వీరి మ‌ధ్య అపోహ‌లు కొంత వ‌ర‌కు త‌గ్గాయ‌ని క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే వీటికి చెక్ పెడుతూ శ్రీ‌నివాస రెడ్డి ఎన్టీఆర్‌తో స్వ‌యంగా సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు. ఇక శ్రీ‌నివాస‌రెడ్డి ఎన్టీఆర్‌తో ఉన్న గ్యాప్‌కు సెల్ఫీ ఫొటోతో చెక్ పెట్టినా అస‌లు వీరిద్ద‌రి మ‌ధ్య ఎందుకు గ్యాప్ వ‌చ్చింద‌న్న అనుమానాలు చాలా మందికే ఉన్నాయి. దీనికి శ్రీ‌నివాస‌రెడ్డి ఓ మీడియా ఇంట‌ర్‌వ్యూలో చెక్ పెట్టారు. 


అన‌వ‌స‌రంగా ఎవ‌రో సృష్టించిన వ‌దంతుల వ‌ల్లే త‌మ ఇద్ద‌రి మ‌ధ్య స్నేహ బంధం దెబ్బ తింద‌ని శ్రీ‌నివాస్ చెప్పారు. ఎన్టీఆర్ టీడీపీ త‌ర‌పున అప్ప‌ట్లో ప్ర‌చారం చేసిన సంగ‌తి తెలిసిందే.  ఎన్టీఆర్ త‌న‌తో పాటు ప్ర‌చారం చేసేందుకు శ్రీ‌నివాస‌రెడ్డి, హేమ‌, రాజీవ్ క‌న‌కాల ఇలా త‌న‌కు బాగా స‌న్నిహితమైన వాళ్ల‌ను పార్టీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు తీసుకువెళ్లాడ‌ట‌. ఖ‌మ్మంలో ఒక స‌భ అయ్యాక స‌భ నుంచి తిరిగి వ‌స్తుండంగా ఎన్టీఆర్, శ్రీ‌నివాస రెడ్డి వేరువేరు కార్ల‌లో బ‌య‌లుదేరారు. న‌ల్లొండ జిల్లాకు వ‌చ్చే స‌రికి ఎన్టీఆర్ కారుకు యాక్సిడెంట్ అవ‌డం... ఎన్టీఆర్ తీవ్ర గాయాల‌పాలై హాస్ప‌ట‌ల్లో జాయిన్ అవ‌డం... పెద్ద ప్ర‌మాదం నుంచి బ‌య‌ట ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆ వెంట‌నే ఎన్టీఆర్ కారు వెన‌కే వ‌చ్చిన శ్రీ‌నివాసరెడ్డి ఎన్టీఆర్ త‌ల‌కు గుడ్డ చుట్టి త‌న కారులో హాస్ప‌ట‌ల్‌కి తీసుకు వెళ్లాడ‌ట‌. 


ఈ సంఘ‌ట‌న జ‌రిగాక‌ ఎన్టీఆర్ ఫ్రెండ్స్‌లో కొంత మంది అన‌వస‌రంగా శ్రీ‌నివాస‌రెడ్డిపై నింద‌లు వేశార‌ట‌. శ్రీ‌నివాస‌రెడ్డి వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని.. ఆయ‌న వ‌ల్లే ఎన్టీఆర్ లైఫ్ డేంజ‌ర్‌లో ప‌డి ఉండేద‌న్న అర్థం వ‌చ్చేలా ఏదేదో ప్ర‌చారం చేశారట‌. ఇలా ఎవ‌రో సృష్టించిన పుకార్ల వ‌ల్ల ఎన్టీఆర్‌కు శ్రీ‌నివాస రెడ్డికి మ‌ధ్య అనుకోని అగాధం ఏర్ప‌డి ఎన్టీఆర్ సినిమాల్లో శ్రీ‌ను ఎంట్రీ బంద‌యిపోయింది. చివ‌ర‌కు  త్రివిక్ర‌మ్ మ‌ధ్య వ‌ర్తిత్వంతో ఈ అపోహ‌లు తొల‌గిపోయాయి. చివ‌ర‌కు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అర‌వింద స‌మేత నుంచే మ‌ళ్లీ వీరి బంధం ట్రాక్ ఎక్కింది. ఎంత గొప్ప‌ స్నేహితుల మ‌ధ్య అయినా చిన్నపాటి అవ‌రోధాలు ఏర్ప‌డితే అవి ఎంత దూరం తీసుకువెళ్తాయో ఇదే పెద్ద ఉదాహ‌ర‌ణ‌.


మరింత సమాచారం తెలుసుకోండి: