కేన్స్ ఉత్స‌వాల్లో  డిజైన‌ర్ డ్రెస్‌ల‌తో వేడెక్కిస్తుంది. మొదటి రోజు రెండు డిఫరెంట్ డిజైనర్ డ్రెస్ లలో కనిపించి మైమరిపించింది కంగన. నేడు మూడో సారి స్టన్నింగ్ లుక్ తో కట్టి పడేసింది. కేన్స్ 2019 సంబరాల్లో క్వీన్ సంథింగ్ స్పెషల్ అన్న చర్చ  సాగింది. సాటి నాయికలు దీపిక.. ప్రియాంక చోప్రాకి ధీటైన పోటీని ఇచ్చింది.


మ‌న భార‌త‌దేశం సాంప్ర‌దాయం ప్ర‌కారం గోల్డ్ శారీలో అంద‌రిచూపులు త‌న‌వైపు తిప్పుకుంది. . బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ కి కజిన్ సిస్టర్ లా కంగన ఇచ్చిన ఫోజు ఇంకా కళ్లముందు రింగులు తిరుగుతూనే ఉంది. ఈలోగానే ఇదిగో ఇలా వైట్ అండ్ వైట్ ఫుల్ లెంగ్త్ స్పెషల్ గౌనులో మరోసారి మతిచెడే ట్రీటిచ్చింది.


మానస సరోవరంలోని హంస  లేక పాలపిట్ట గూడు మరిచి కేన్స్ లో వాలిందా? అన్నట్టుగా ఉందీ రూపం.  అటు సంప్రదాయ దుస్తులు నుంచి ఇటు లేటెస్ట్ మోడ్ర‌న్ డ్ర‌స్సుల వ‌ర‌కు ఏది వేసినా త‌న‌కోసమే డిజైన్ చేసిన‌ట్టు అనిపించాయి. శత్రువుల్ని తిట్టి తాట తీయడంలోనే కాదు.. ఫ్యాషన్ ప్రపంచాన్ని గజగజ ఒణికించడంలోనూ కంగనను కొట్టేవాళ్లే లేరు సుమీ! ఏ రంగంలోనైనా నాకు నేనే సాటి అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: