కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గజిని సినిమాతో తెలుగులో కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత నుండి ఆయన నటించిన సినిమాలన్ని తెలుగులో రిలీజ్ అవుతూ వస్తున్నాయి. తెలుగులో కూడా సూర్య, కార్తిలకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే రీసెంట్ గా సూర్య చేసిన సినిమాలేవి అంచనాలకు తగినట్టుగా లేకపోవడంతో తెలుగులో అతని మార్కెట్ తగ్గింది.


ఒకప్పుడు తెలుగు సినిమాలకు ధీటుగా సూర్య సినిమాల రైట్స్ ఉండేవి.. కాని ఇప్పుడు పరిస్థితి మారింది. కాస్త కూస్తో కార్తి సినిమాకు ఉన్న డిమాండ్ కూడా సూర్య సినిమాలకు లేకుండా పోయింది. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు ఉన్న డిమాండ్ రాను రాను తగ్గుతూ వస్తుంది. మన దర్శకులు కూడా కొత్తగా సినిమాలు చేయడం మొదలు పెట్టడంతో డబ్బింగ్ సినిమాలను చాలా లైట్ తీసుకుంటున్నారు తెలుగు ప్రేక్షకులు.


ఈ క్రమంలో సూర్య నటించిన ఎన్.జి.కే సినిమాపై తమిళంలో ఎన్నో భారీ అంచనాలున్నాయి. సెల్వ రాఘవన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 31న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాను తెలుగులో సత్యసాయి సంస్థ అధినేత కె. కె రాధామోహన్ తీసుకున్నారు. తెలుగు థియేట్రికల్ రైట్స్ 8 కోట్లకు కొన్నట్టు టాక్.


ప్రస్తుతం సూర్య మార్కెట్ రేంజ్ ను బట్టి చూస్తే తెలుగులో ఆ ప్రైజ్ ఎక్కువే కాని ఒకప్పుడు మంచి ఫాం లో ఉన్న టైంలో తెలుగులో కూడా భారీ మార్కెట్ ఉండేది. ఈమధ్య సూర్య సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాలు రాబట్టకపోవడంతో తెలుగులో కూడా పెద్దగా క్రేజ్ ఏర్పడలేదు. మరి ఎన్.జి.కే అయినా సూర్య ఖాతాలో హిట్ పడేలా చేస్తుందో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: