నందమూరి బాలకృష్ణ, ఇటీవల తన తండ్రి స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా నటించిన బయోపిక్ సినిమాలు ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు బాక్సాఫిస్ దగ్గర బోల్తాపడడంతో కొంత ఢీలా పడ్డారనే చెప్పాలి. నిజానికి తొలుత ఈ బయోపిక్ ప్రారంభం సమయంలో యావత్ తెలుగువారందరిలో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో రెండు భాగాలు తీవ్రంగా విఫలమయ్యాయి. అనంతరం కొంత ఆలోచనలోపడ్డ బాలయ్య, తదుపరి చేయబోయే సినిమాతో హిట్ కొట్టి తన అభిమానులను సంతృప్తిపరచాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. 


ఇక అనుకున్నవెంటనే తనకు గత ఏడాది జైసింహా సినిమాతో హిట్ ఇచ్చిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి రెడీ అయ్యారు. నిజానికి బాలయ్య, బోయపాటితో ఇప్పటికే ఒక సినిమా చేయాల్సి ఉంది, అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఆ సినిమా మరికొన్నాళ్లు వాయిదా పడడంతో అయన రవికుమార్ కు అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక బాలయ్యకు కెరీర్ పరంగా కంబ్యాక్ సినిమాలుగా మంచి హిట్స్ అయిన సింహ, లెజెండ్ వంటి సినిమాలను అందించిన బోయపాటి మాత్రమే అయన రేంజి మాస్ హిట్ ఇవ్వగలడని, అయితే కేఎస్ రవికుమార్ వంటివారు ఆయనతో మంచి సినిమాలు చేసినప్పటికీ అవి, బోయపాటి రేంజి హిట్ ఇవ్వలేవనేది కొందరు నందమూరి అభిమానులు అంటున్న మాట. 


ఒకరకంగా ఈ మాట నిజమేనని, అయితే బోయపాటితో సినిమా త్వరలో ప్రారంభంకానుంది అనేది ఒకరకంగా అయన ఫ్యాన్స్ కు మంచి బూస్ట్ నిచ్చే వార్త అని, అయితే ప్రస్తుతానికి అయన రవికుమార్ గారితో చేయబోయే సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి బాలకృష్ణ కు కెరీర్ పరంగా ప్రస్తుతం ఒక భారీ హిట్ అవసరం అనే చెప్పాలి. అయితే అటువంటి హిట్ ఎవరు ఇస్తారు అనేది తెలియాలంటే మరికొద్దిరోజులు ఓపికపట్టవలసిందే.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి: