మహర్షి సినిమా రైతుల సమస్యల చుట్టూ తిరుగుతుంది. సమస్యల గురించి చర్చించి వదిలేయకుండా... దానికి పరిష్కారం ఏంటి అన్నది కూడా ఈ సినిమాలో చెప్పింది.  అంతేకాదు, రైతులపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు.  రైతుకు గౌరవం ఇవ్వండి చాలు అని చెప్పిన సినిమా మహర్షి.  ఈ మెసేజ్ ప్రతి ఒక్కరి హార్ట్ ను టచ్ చేసింది.  అందుకే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.  


రైతుపై గౌరవం పెంచేలా సినిమా ఉండటంతో ఈరోజు పెద్ద హిట్టైంది.  ఈ సినిమా విజయోత్సవ సభ విజయవాడలోని సిద్దార్ధ కళాశాల ఆవరణలో జరుగుతున్నది.  ఈ సందర్భంగా రైతు పాత్రలో నటించిన గురుస్వామి చాలా ఉద్వేగంగా మాట్లాడాడు.  ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా చాలీ చాలని జీతంతో జీవితం గడిపేందుకు పడే ఇబ్బందులను చూసి తట్టుకోలేక కొంత మానసిక శాంతి కోసం నటన అనే జీవితాన్ని ఎంచుకొని నాటకాలు వేయడం మొదలు పెట్టానని, కర్నూలులో అనేక నాటకాలు వేశామని చెప్పారు.  


కాలం మారడంతో... మీడియా మారింది.  నాటకాల స్థానంలో షార్ట్ ఫిలిమ్స్ వచ్చాయి.  తన ఫ్రెండ్స్ తో కలిసి చేసిన ఆయుష్మాన్ భవ అనే షార్ట్ ఫిల్మ్ చేశానని, ఆ షార్ట్ ఫిలిం చూసి తనకు అవకాశం ఇచ్చారని అన్నారు.  రైతుగా తనకు అవకాశం ఇచ్చి తనను ప్రోత్సహించిన దర్శకుడికి అందరికి గురుస్వామి థాంక్స్ చెప్పారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: