త్రిష.. దక్షిణాదిలో ఇంకా డిమాండ్ ఉన్న సీనియర్ తారల్లో ఒకరు. పదిహేనళ్లకు పైగా కెరీర్ ఉన్న ఈ అమ్మడుకు ఇంకా అవకాశాలు బాగానే వస్తున్నాయి. తెలుగులో పెద్దగా కనిపించకపోయినా.. తమిళంలో అమ్మడి పరిస్థితి బాగానే ఉంది.


ప్రస్తుతం త్రిష చేతిలో ఐదు వరకూ సినిమాలు ఉన్నాయట. ఆమె నటించిన పరమపథం విలయాటు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సెన్సార్‌ ఇటీవలే పూర్తయింది. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికెట్ లభించిందట. 

క్లీన్ యూ అంటే అంతా బావుందనేగా అర్థం కానీ.. అసలు విషయం ఏంటంటే.. ఈ సినిమాలోని కొన్ని సీన్లలో త్రిష చాలా రెచ్చిపోయి నటించిందట. ఆమె సెక్సీ ఎక్స్ ప్రెషన్స్, ఎక్స్ పోజింగ్ చూసి సెన్సార్ బోర్డు వాళ్లే సిగ్గుపడ్డారట.

కాకపోతే.. యూ సర్టిఫికెట్ ఉంటే టాక్స్ మినహాయింపులు ఉంటాయి కాబట్టి.. ఆ సీన్లను కట్ చేసేందుకు పాపం నిర్మాత అయిష్టంగానే అంగీకరించాడట. దీంతో క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది. అయినా ఈ సినిమా కష్టాలు తీరలేదు. డిస్ట్రిబ్యూటర్లు మరీ తక్కువకు అడుగుతుండటంతో నిర్మాత ఇంకా రిలీజ్ చేయలేదట. 



మరింత సమాచారం తెలుసుకోండి: