ఏపీ ఎన్నికల్లో జగన్ సీఎం కావడం ఖాయమంటున్నారు ప్రముఖ నటుడు దేవదాస్ కనకాల. దేవదాస్ కనకాల నటుడిగా కన్నా నట శిక్షకుడిగా బాగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో ఏపీ రాజకీయాలపై స్పందించారు. 


జగన్ పాదయాత్ర ద్వారా ప్రజల మనసులు గెలుచుకున్నాడని.. ఆయన తప్పకుండా సీఎం అవుతారని అన్నారు. చంద్రబాబు పనైపోయిందని.. ఆయనకు రిటైర్మెంట్ తప్పదని జోస్యం చెప్పారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు దేవదాస్ కనకాల. 

కాకపోతే ఆ మంచితనం .. ప్రాక్టికాలిటీలో కుదరదని చెప్పారు. ఇక నారా లోకేశ్ గురించి చాలా ఘాటుగా స్పందించిన కనకాల.. ఆయనకు మంగళగిరి పేరు కూడా సరిగ్గా పలకడం రావడం లేదని విమర్శించారు. ఇలాంటి వాళ్లు నాయకులైతే రాజకీయం నవ్వుల పాలవుతుందన్నారు. 

నారాలోకేశ్ రాజకీయాల్లో రాణించడం కష్టమని.. ఆయన మంగళగిరిలో ఓడిపోబోతున్నాడని దేవదాస్ కనకాల అంచనా వేశారు. ఎన్టీఆర్‌ కూడా గతంలో కొంత చంద్రబాబు వంటి నాయకులపై ఆధారపడ్డారని.. కానీ వైఎస్సార్ ఎవరిపైనా ఆధారపడకుండా స్వయంకృషితో సీఎం అయ్యారని కొనియాడారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: