గాయత్రి.. అంటే వెంటనే గుర్తు పట్టడం కాస్త కష్టమే.. కానీ ఫిదా గాయత్రి అంటే వెంటనే గుర్తొచ్చేస్తుంది. ఆ సినిమాలో సాయి పల్లవి స్నేహితురాలిగా చక్కగా నటించిందా అమ్మాయి. ఆ సినిమాతోనే గాయత్రి ఫేమ్ అయ్యింది.


అయితే ఫిదా సినిమాలో కనిపించిన గాయత్రికి ఇప్పుడు కనిపించే గాయత్రికి అస్సలు పొంతన ఉండదు.. లేటెస్ట్ హెయిర్ స్టయిల్ తో విభిన్నంగా కనిపిస్తుంది గాయత్రి. ఆమె తాజాగా రామ్ గోపాల్ వర్మ సినిమాలో నటిస్తోంది.

తనకు వర్మతో పని చేసే అవకాశం ఎలా వచ్చిందో వివరించింది గాయత్రి.. వర్మ దగ్గర పనిచేసే ఓ కెమేరా మెన్  గాయత్రి ఫ్రెండ్ అట. ఇలా ఓ సినిమా ఛాన్స్ ఉందని తెలియగానే తన ఫ్రెండ్ కు చెప్పిందట. వర్మ ఆఫీస్ నుంచి ఫోన్ చేసి పావుగంటలో వచ్చేయాలని చెప్పారట. 

అంతే హడావిడిగా వర్మ ఆఫీసుకు వెళ్లి ఆయన్ను కలిసిందట గాయత్రి.. ఆయన కొద్ది సేపు మాట్లాడి.. ఓకే.. రేపటి నుంచి షూటింగ్ ఇదే డ్రస్సులో వచ్చేయాలని చెప్పేశారట. ఆర్జీవీ వంటి పెద్ద డైరెక్టర్ అలా నిమిషాల్లో తేల్చేయం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిందంటోంది గాయత్రి. 



మరింత సమాచారం తెలుసుకోండి: