యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ కెరీర్ బాహుబలి రెండు భాగాలతో ఒకరకంగా ఎవరూ అందుకోలేనంత ఎత్తుకు ఎదిగింది అనే చెప్పాలి. నిజానికి ఆ సినిమాల కోసం దాదాపుగా ఐదేళ్లకుపైగా కష్టపడ్డ ప్రభాస్ కు, ఆ రెండు చిత్రాల విజయాలు ఆయనకు చరిత్రలో నిలిచిపోయే పేరును అందించాయి. ఇక ఆ తరువాత ఆయనకు క్రేజ్, ఫేమ్, ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ వేల్యూ కూడా అమాంతం పెరిగిపోయాయి. ఇక ప్రస్తుతం అయన సుజిత్ దర్శకత్వంలో సాహో మరియు జిల్ సినిమా దర్శకుడు రాధా కృష్ణతో కలిసి మరొక సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. 

ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, కొన్నాళ్లుగా కొన్ని అనివార్య కారణాల వలన సాహో షూటింగ్ కు అక్కడక్కడా బ్రేక్ లు పడుతుండడంతో, సినిమాకు సంబందించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు సాహో యూనిట్, ప్రభాస్ ఫ్యాన్స్ ముందుకు తీసుకురాలేకపోతున్నాయి. కావున ఇకపై రెగ్యులర్ గా షూటింగ్ అప్ డేట్స్ ని అభిమానులకు అందించనుందట సాహి యూనిట్. ఇక ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రాబోయే జూన్ లో సాహో ట్రైలర్ విడుదల కానుందని అంటున్నారు. నిజానికి బాహుబలి మొదటి భాగం ట్రైలర్ 2015లో జూన్ లోనే విడుదలై మంచి సంచలనాన్ని సృష్టించిందని, 

ఇక సాహో ట్రైలర్ కూడా ఒకవేళ జూన్ లో విడుదలైతే ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయమని రెబల్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరోవైపు సాహో టీమ్ కూడా సినిమా షూటింగ్ త్వరితగతిన పూర్తి చేసి, వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ న్యూస్ ప్రకారం జూన్ లోనే సాహో ట్రైలర్ విడుదలవుతుందా లేదా అనేది మాత్రం ఆ సినిమా టీమ్ నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు చెప్పలేము. ఒకవేళ ఇది కనుక నిజమే అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కు పెద్ద పండుగే అని చెప్పుకోవాలి....!!


మరింత సమాచారం తెలుసుకోండి: