ఢిల్లీలో చంద్రబాబు హల్ చల్ చేస్తున్నారు. బాగానే ఉంది. సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన. 1996లో ప్రతిపక్షాలను కూటమి కట్టించి ఇద్దరిని ప్రధానులుగా చేసిన చరిత్ర ఉంది. అలాగే అనూహ్యంగా వాజ్ పేయి సర్కార్ కి వెన్నుదన్నుగా నిలిచి తాను ఎక్కడ ఉంటే అక్కడ అధికారం అనిపించుకున్నారు. ఇపుడు అదే చంద్రబాబు రాజకీయంగా ఎదిగారా లేకా తగ్గారా అన్నదే  ప్రశ్న.


చంద్రబాబు ఏడాది క్రితం వరకూ రాహుల్ గాంధీని బచ్చా అనేవారు. పప్పు అనేవారు. ఆయనకు ఏ రాజకీయం తెలియదు అంటూ దారుణంగా మాట్లాడారు. ఏపీని తల్లీ కొడుకులు నాశనం చేశారని కూడా నిందించారు. మరి ఇపుడు అదే జూనియర్ పక్కన చంద్రవాబు నిలబడి ఉన్నారు. బాబు ఏం చేస్తున్నారు అంటే ప్రతీ రోజూ రాహుల్ తో మాట్లాడుతున్నారు. అంతేనా ఆయనకు దూతగా మారిపోయారు.


రాహుల్ తరఫున ప్రతిపక్ష నేతలను కలుసుకుని మద్దతు సేకరిస్తున్నారు. ఈ పనిలో భాగంగా ఆయన మాయావతి, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతలను కలిసారు. మరి వారు ఏమన్నారో తెలియదు కానీ ఆ ముచ్చట్లు  మళ్ళీ వచ్చి రాహులు కి ఈ రోజు నివేదించారు. బాబుకు రాహుల్ ని పీఎం చేయాలని ఉంది. కానీ ఇతర ప్రతిపక్షాలు దానికి అంగీకరిస్తాయా అన్నదే ఇక్కడ ప్రశ్న.


ఇక కాంగ్రెస్ పార్టీలో ఈ రకమైన రాయబేరాలు చేసే నాయకులు లేరా లేక వారెవరికీ ప్రతిపక్షాలతో సంబంధాలు లేవా, మరి బాబుని రాహుల్ నమ్మారా. బాబే రాహుల్ని భుజానా ఎక్కించుకున్నారా అన్నది అర్ధం కావడంలేదు కానీ బాబు మాత్రం డిల్లీలో చక్రం తిప్పుతున్నారని అనుకూల మీడియా డప్పు వాయిస్తోంది. నిజానికి బాబు గతం కంటే ఇపుడు బాగా దిగిపోయారు. తగ్గిపోయారు. 


బాబు మాటలోనే చెప్పాలంటే ఏ మాత్రం అనుభవం లేని రాహుల్ ముందు చేతులు కట్టుకుంటున్నారు. ఆయనకు దూతగా మారిపోయారు. ఇవన్నీ  ఇలావుంటే రేపటి రోజున ఏపీలో చంద్రబాబుకు అధికారం వస్తే సరే సరి లేకపోతే ఇంతలా చాకిరి చేసినందుకు గాను రాహుల్ బాబుని పిలిచి పెద్ద పీట వేస్తారా లేక ఏపీలో వైసీపీకి ఎక్కువ ఎంపీలు వస్తే వారిని భుజాన ఎక్కించుకుంటారా అన్నదే పెద్ద పాయింట్.  అపుడు మరి బాబు పరిస్థితి ఏంటో అని సెటైర్లు పడుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: