ఆత్రేయ, వేటూరి సుందర రామ్మూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి, సి.నా.రే...ఈ జాబితాలో ఉండాల్సిన యువ గీత రచయిత. వీళ్ళ లాగే అర్ధవంతంగా శబ్ధ సౌందర్యాన్ని అద్దాలనుకునే పాటల పిచ్చోడు. పాట తోటే పలకరిస్తాడు, అదే పాటతో తన పక్కవాళ్ళని పులకరింపజేస్తాడు. పాటకు ప్రాణం పోస్తాడు, పల్లవులతో ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తాడు. అతనే లిరిసిస్ట్ 'పోతుల రవికిరణ్'. వి.ఆర్.ప్రతాప్, వాకాడ అప్పారావు ద్వారా 'నువ్వు వస్తావని' సినిమాతో పాటల రచయితగా ప్రారంభమైన సినీ ప్రయాణం మొదట్లో చాలా వేగంగా సాగింది. హ్యాపీ, సొంతం, ఇష్టం, ఆనందం, సింహరాశి, వాసు, సందడే సందడి, తొట్టి గ్యాంగ్, సంక్రాంతి, అమ్మాయిలు-అబ్బాయిలు, స్వామీ నుండి రీసెంట్‌గా వచ్చిన 'తేజ్ ఐ లవ్యూ' వరకూ ఎన్నో అద్భుతమైన పాటలను రాశారు.

రామోజీ రావు, అల్లు అరవింద్, కె.ఎస్.రామారావు, వల్లభ, ఆర్.బి.చౌదరి, అడ్డాల చంటి వంటి అగ్ర నిర్మాత బ్యానర్ లో పాటలు రాసే అవకాశాన్ని అందుకున్నారు. అంతేకాదు వీళ్ళతో గొప్ప అనుబంధాన్ని కొనసాగిస్తున్నారు. అంతేకాదు డైరెక్టర్ 'కరుణాకరణ్' తో రవికిరణ్ కి ప్రత్యేకమైన అనుబంధం ఉండటం విశేషం.
మణిశర్మ, దేవీశ్రీ ప్రసాద్, ఆర్.పి.పట్నాయక్, చక్రి, ఎం.ఎం.కీరవాణి, రమణ గోగుల, అజయ్ అతుల్.. వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పని చేసిన రవి కిరణ్ కి తన జీవితంలో గొప్పగా చెప్పుకునే ఎన్నో పాటలను రాశారు.

ఇంత గొప్ప పాటలు రాసిన రవి కిరణ్ కి ఒక వెలితీ కూడా ఉంది. అదే మ్యూజిక్ మాస్ట్రో 'ఇళయరాజా' గారితో కలిసి పని చేసే అవకాశం రాకపోవడం. అలానే ఎస్.ఎస్.థమన్..ఇంకా మాటల మాంత్రీకుడు, దర్శకులు త్రివిక్రం శ్రీనివాస్ తో కలిసి కూడా పని చేయలేదనే చిన్నకోరిక రవి కిరణ్ కి అలానే ఉండిపోయింది. ఇక ఇలాంటి టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ కి కంటిన్యూస్‌గా సాంగ్స్ రాసే ఛాన్స్ తక్కువగా వస్తుండటంతో మనసులో బాధ ఉన్నప్పటికీ తన మీద తనకున్న నమ్మకంతో, సినిమా ఇండస్ట్రీ మీదున్న ప్రేమతో అలా సాగిపోతూ మంచి పాట రాసే అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: