తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో కొత్తదనాన్ని తీసుకు వచ్చి థియేటర్లో కూర్చున్నవారికి ఆనందంతో పాటు థ్రిల్ ఇస్తున్న ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు లారెన్స్ మరోసారి తన మాట నిలబెట్టుకున్నాడు.  మొదటి నుంచి సేవాదృక్పదంతో కొనాసాగుతూ..తనకు వచ్చిన పెట్టుబడిలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.  చిన్నారులకు అనాథాశ్రమాలు, వృద్దులకు ఓల్డేజ్ ఆశ్రమాలు నిర్మిస్తున్నారు.  చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తున్నారు. 


దేశ వ్యాప్తంగా ఎక్కడ ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడినా లారెన్స్ ముందుగా స్పందిస్తూ..భారీగా విరాళాలు ఇస్తున్నారు. గతేడాది నవంబర్ నెలలో గజా తుపాను తమిళనాడు, కేరళను వణికించింది. భీకరమైన గాలులు, భారీ వర్షాలతో చాలా ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ క్రమంలో కేరళలోని ఓ పెద్దావిడ ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో ఆమె కన్నీటి పర్యంతమయింది.  ఇక దీన స్థితికి ఛలించిపోయిన లారెన్స్ అప్పట్లో ఓ ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. 


ఈ విషయం అంతా మర్చిపోయారు..కానీ ఇప్పుడు అందరూ ఆనందిస్తున్నారు..ఎందుకో తెలుసా..లారెన్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు.  అన్నట్లుగానే పెద్దావిడకు సొంత నిధులతో ఇంటిని నిర్మించి ఇచ్చారు. పూజలు నిర్వహించిన అనంతరం వృద్దురాలితో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ విషయాన్ని లారెన్స్ ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చిన యువకులకు ధన్యవాదాలు తెలిపారు. తాజాగా లారెన్స్ పని చూసి అందరూ ఆయన్ని ప్రశంసిస్తున్నారు. 

  

మరింత సమాచారం తెలుసుకోండి: