ఇప్పటి హీరోయిన్స్ అందాలను ఆరబోయటంలో అసలు వెనుకడుగు వేయటం లేదు. నిత్యం సోషల్ మీడియాలో హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. అయితే ఎవెలిన్ శర్మ తెలుసు కదా?  మీకు తెలియక పోయినా త్వరలో తెలిసిపోతుంది. కారణం ఏంటంటే ఈ భామ ప్రభాస్ 'సాహో' లో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.   అయితే పాప హాట్ నెస్ బయోడేటాను గురించి చెప్పాలంటే అందరి వల్లా కాదు.


దానికి కూడా బీకాం ఫిజిక్స్ లాగా జఫ్ఫా యూనివర్సిటీ ఆఫ్ హాట్ సైన్సెస్ లో బికినీయిజం లో పీహెచ్ డీ చేసి ఉండాలి.  లేకపోతే మాటల రాక.. కీబోర్డు లోని ఎస్ డీ ఎఫ్ :ఎల్ కే జీ ల పై వేళ్ళు కదలక ఎంతో వేదన అనుభవించాల్సి వస్తుంది.  ఈ భామ తాజాగా.. అంటే 24  గంటల క్రితం తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు ఆమె ఇచ్చిన క్యాప్షన్ "ఈ సమ్మర్ హీట్ రిడిక్యులస్ గా ఉంది #కూల్ డౌన్ #ముంబై వెదర్ # పూల్ టైమ్". అంటే ముంబై హీటుకు పిచ్చెక్కి రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేసింది. 


ఇంతకీ ఫోటోను కళ్ళారా దర్శించుకున్నారు కదా?  సంతోషం.  ఇప్పుడర్థం అయింది కదా వీటి గురించి రాయాలంటే  జఫ్ఫా యూనివర్సిటీలో డిగ్రీ ఎందుకు అవసరమో.  అయితే కామెంట్స్ పెట్టేందుకు మాత్రం అదేమీ అవసరం లేదు. అందుకే ఎవెలిన్ ముంబైలో హీట్ వేవ్ కు షాక్ తిన్నట్టుగా.. వారి వారి ఊర్లలో ఎండకు బ్రెయిన్ అటూ ఇటూ ఊగుతున్న నెటిజనులను ఈ హాటు షో మళ్ళీ ఈ లోకానికి తీసుకొచ్చింది.  ఒక నెటిజనుడు"నువ్వు నా మనసుని గాయపరుస్తున్నావు"అన్నాడు.  అంటే బాడీని ఎండ రఫ్ఫాడిస్తుంటే మనసు బాక్సును ఎవెలిన్ బద్దలు చేస్తోందన్నమాట. 

మరింత సమాచారం తెలుసుకోండి: