ఇండస్ట్రీలోకి జూనియర్ ఎన్టీఆర్ గా పరిచయం అయ్యి ఇప్పుడు ఎన్టీఆర్ గా స్థిరపడిపోయారు.  తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్.  ఎన్టీఆర్ సినిమా అంటే మాస్ లో ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పక్కర్లేదు.  సినిమా ఎలా ఉన్నా సరే మాక్సిమం డబ్బులు వెనక్కి వస్తాయనే ధైర్యం నిర్మాతల్లో ఉంటుంది.  అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తారు.  అంతేకాదు, ఒక్కసారి కమిట్మెంట్ ఇచ్చాడు అంటే... దానికి కట్టుబడి ఉంటాడు.  చెప్పిన సమయానికి కంటే ముందుగానే సెట్స్ కు వస్తాడు అనే పేరు ఉన్నది.  ఈ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు టాలీవుడ్ లో గురూజీగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు.  అరవింద సమేత సినిమా సమయంలో ఎన్టీఆర్ క్రమశిక్షణ బాగా నచ్చిందని, ఆయనను ఫాలో అవుతున్నానని చెప్పారు.  


1996 లో వచ్చిన రామాయణం అనే పిల్లల మూవీతో సినిమా తెరకు పరిచయం అయ్యారు.  ఆ సినిమా జాతీయ అవార్డును గెలుచుకుంది.  ఆ తరువాత 2000 వ సంవత్సరంలో ఎన్టీఆర్ నిన్నుచూడాలని సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు.  మొదటి సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.  రెండో సినిమా రాజమౌళితో స్టూడెంట్ నెంబర్ 1 చేశాడు.  అది ఎలాంటి హిట్ కొట్టిందో చెప్పక్కర్లేదు.  2002 లో వివి వినాయక్ తో చేసిన ఆది సినిమా మాస్ హీరోగా నిలబెట్టింది.  ఆ మరుసటి ఏడాది రాజమౌళితో చేసిన సింహాద్రి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.  అక్కడి నుంచి ఎన్టీఆర్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.  యమదొంగ, సాంబ, అదుర్స్, బృందావనం, బాద్షా, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు.  


ఇప్పుడు రాజమౌళితో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు.  చారిత్రాత్మక కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నవరసాలను తనలో పలికించగల నటుడిగా పేరు తెచ్చుకున్నాడు.  చిన్నతనంలో కూచిపూడి డ్యాన్స్ నేర్చుకోవడంతో సినిమాల్లో అది బాగా ఉపయోగపడింది.  మంచి డ్యాన్సర్ కూడా.  డైలాగ్స్ చెప్పడంతో పెద్ద ఎన్టీఆర్ కు ఏ మాత్రం తీసిపోడు.  ఈరోజు అంటే మే 20 వ తేదీ ఎన్టీఆర్ పుట్టినరోజు.  మాములుగా ఎన్టీఆర్ పుట్టినరోజును ఫ్యాన్స్ అద్భుతంగా జరుపుతుంటారు.  కానీ, ఈ ఏడాది ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: