వరుస హిట్ లతో మంచి జోరు మీద ఉంది మన అక్కినేని గారి కోడలు సమంత. తెలుగు లో రంగస్థలం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత సమంత వరుస సినిమాల షెడ్యూల్ తో చాల బిజీ గా ఉంది. చాల తమిళ తెలుగు సినిమాలు లైన్ లో ఉన్నాయి. తన భర్త అయిన నాగ చైతన్య తో కలసి నటించిన “మజిలీ” సినిమా పెద్ద హిట్ కావడం తో ఇంకా ఆహ జోరు అలానే సాగుతుంది.

 

మజిలీ సినిమా సమాంతకి ఏంత పెద్ద హిట్ ఓ తెలియదు గాని నాగ చైతన్య కెరీర్ కి మాత్రం మంచి బ్రేక్ పాయింట్ పడింది. ఈ చిత్రం లో ఇద్దరు చాల సహజం గా నటించారు, రియల్ లైఫ్ భార్యబార్థాలు రీల్ లైఫ్ లో కూడా అదే పాత్ర లో అందరిని అలరించారు. ఈ సినిమాలో ఇద్దరు నటులుగా మంచి పేరు సంపాదించారు. ఇప్పటికీ మజిలీ కలెక్షన్స్ బాగానే ఉన్నాయని చెప్పొచ్చు.

 

ఇంత పెద్ద హిట్ తరువాత ఏ హీరోయిన్ అయిన సరే చాల జాగ్రత్త గా స్క్రిప్ట్ ను ఏన్చుకుంటారు అలానే సమాంత కుడా ప్రముఖ లేడి డైరెక్టర్ నందిని రెడ్డి తో “మిస్ గ్రాని” అనే సినిమా కి సంతకం చేసింది. ఈ సినిమా లో సమాంత డీ-గ్లామరస్ రోల్ లో కనిపించనుంది. ఒక 70 సంవత్సరాల ముసలావిడ పాత్రలో కనిపించి అందరాని షాక్ కి గురి చేయడానికి రెడీ గా ఉంది. ఈ సినిమా కొరియన్ సినిమాకి రీమేక్.

 

అయితే ఈ సినిమా కు తెలుగు లో “ఓ బేబీ” అనే టైటిల్ ను పెడుతున్నారట. ఇదిలా ఉండగా ప్రముఖ ప్రొడ్యూసర్ సురేష్ బాబు ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చెప్పారట నందిని రెడ్డి కి. మొత్తానికి ఈ సినిమా టీం స్క్రిప్ట్ మీద చాల కస్టపడి వర్క్ చేస్తుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీ గా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: