యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ పుట్టినరోజు ఈరోజు.. నిన్ను చూడాలని సినిమా నుండి అరవింద సమేత వరకు చేసిన ప్రతి సినిమాలో తన నటనతో ప్రేక్షకులను అభిమానులను మెప్పించిన తారక్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ అంటూ మరో సంచలనానికి సిద్ధమయ్యాడు. బాహుబలి తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్నాడు. 


ఆ సినిమాలో కొమరం భీం పాత్రలో తారక్ నటిస్తున్నాడు. అయితే ఈరోజు బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ ట్రీట్ ఏదైనా ఉంటుందని నందమూరి ఫ్యాన్స్ ఆశించారు. కాని అలాంటిదేమి లేకుండానే కానిచ్చేస్తున్నారు. సినిమా ఇప్పటికే అనుకున్న షెడ్యూల్ మిస్ అవగా ఇక నుండి పర్ఫెక్ట్ షెడ్యూల్ తో పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట రాజమౌళి.


అందుకే ఆర్.ఆర్.ఆర్ మేకింగ్ కు ఇక నో బ్రేక్స్ అని చెప్పాడట. తారక్ బర్త్ డే సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుండి తారక్ లుక్ రిలీజ్ చేస్తారని అనుకోగా సినిమా రిలీజ్ కు ఇంకా సంవత్సరం దాకా ఉంది కాబట్టి ఇప్పుడే సినిమా గురించి ఎలాంటి క్లూఎస్ ఇవ్వట్లేదు జక్కన్న. త్వరలో ఓ భారీ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారట.


అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో డైసీ ఎడ్గర్ జోన్స్ బదులుగా నిత్యా మీనన్ సెలెక్ట్ అయ్యిందని తెలుస్తుంది. డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేశారు. తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేయాలని చూస్తున్న ట్రిపుల్ ఆర్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: