పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి ఏడాదికి పైనే అవుతోంది. ఇక 2014లో అయన స్థాపించిన జనసేన పార్టీ ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, ఆ సమయంలో టిడిపి పార్టీకి మద్దతిచ్చింది. ఇక ఇటీవల జరిగిన 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలిచింది. ఇంకొక మూడు రోజుల్లో ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడి కానున్నాయి. ఇక ఇప్పటికే వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలావరకు జనసేనకు ఊహించిన దానికంటే చాలా తక్కువ సీట్లు వస్తాయని చెపుతున్నాయి. 

అయితే ఈ విషయమై కొన్ని పుకార్లు ప్రస్తుతం అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అవేమిటంటే, ఈ ఎనికల్లో జనసేనకు బాగా తక్కువ సీట్లు వస్తే పవన్ అటు పార్టీ కార్యకలాపాతో పాటు సినిమాలు కూడా చేస్తారని అంటున్నారు. అదే ఫలితాలు కాస్త ఊహించినట్లుగా వస్తే మాత్రం పవన్ నిర్ణయంలో కొంత మార్పు ఉంటుందని టాక్. నిజానికి పవన్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత తన ఫిజిక్ పై కూడా శ్రద్ధ పెట్టడం మానేశారని చెప్పాలి. విపరీతంగా గడ్డం పెంచుకుని పర్యటనలకు హాజరయ్యారు. అయితే రాబోయే రోజుల్లో ఆయన సినిమాల్లోకి రావడం కొంత ఖాయమని, ఈ మేరకు అయన అప్పుడే తన ఫిజిక్ ని పూర్వంలా అందంగా మార్చుకునేందుకు అప్పుడే ట్రైనర్ల పర్యవేక్షణలో కసరత్తులు మొదలెట్టారని అంటున్నారు. 

మరి ప్రస్తుతం ప్రచారమవుతున్న ఈ వార్తలు నిజమా కాదా అనే విషయం అటుంచితే, ఒకవేళ పవన్ సినిమాలోకి మళ్ళి రి ఎంట్రీ ఇస్తే మాత్రం అది మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారి సినిమా ద్వారానే అని అంటున్నారు. నిజానికి గతంలో వారికి పవన్ ఒక సినిమా బాకీ ఉన్నారని, వారికి ఇచ్చిన మాట మేరకే అయన ఆఖరుగా ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారని, దాని తరువాత అయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లోనే ఉండిపోతారని అంటున్నారు. మరి ప్రస్తుతం వస్తున్న ఈ వార్తలు అసలు నిజమేనా కాదా అనేది తెలియాలంటే మాత్రం పవన్ నుండి అధికారిక ప్రక్కన మాత్రం వెలువడవలసిందే.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: