తెలుగు ఇండస్ట్రీల ఇప్పటి వరకు ఎన్నో హిట్ చిత్రాలు వచ్చాయి..అందులో కొన్ని మాత్రమే చెప్పుకోదగ్గ విధంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి.  తాజాగా వంశి పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా నటించిన ‘మహర్షి’చిత్రం ఒకటి.  ఈ చిత్రం ప్రస్తుతం దేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు..కొంత మంది దళారుల చేతిల్లో చిక్క పడుతున్న బాధలు..భూ నిర్వాసితులు తమ బంగారు భూమిని ఎలా పోగొట్టుకుంటున్నారో అన్న విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించారు.

అంతే కాదు రైతుల కోసం సామాన్యల నుంచి సెలబ్రెటీల వరకు మంచి మెసేజ్ కూడా ఇచ్చారు.  ఈ చిత్రంలో మహేష్ బాబు మూడు రకాల పాత్రల్లో నటించి మెప్పించారు.  మహేశ్ బాబు 25వ చిత్రంగా ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు 'మహర్షి' వచ్చిన విషయం తెలిసిందే.  తెలుగు రాష్ట్రాల్లో ఈ 10 రోజుల్లో ఈ సినిమా 64.82 కోట్ల షేర్ ను వసూలు చేసింది. ఒక్క నైజామ్ లోనే ఈ చిత్రం 23.50 కోట్లు వసూలు చేయడం విశేషం. వేసవి సెలవులు కావడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది.

ఈ నేపథ్యంలో మహర్షి 200 కోట్ల గ్రాస్ మార్క్ ను చేరుకోవడం ఖాయమనే టాక్ బలంగానే వినిపిస్తోంది. అంతే కాదు దగ్గరలో చెప్పుకోదగిన పెద్ద చిత్రాలు ఏమీ లేకపోవడం.. వేసవి సెలవులు కావడం ఈ చిత్రానికి బాగా కలిసొచ్చింది. మ‌హేష్ బాబు ‘శ్రీ‌మంతుడు’, ‘భ‌ర‌త్ అనే నేను’ అనే చిత్రాలు బాగా కలిసి వచ్చాయి..ఇదే వరుసలో ‘మహర్షి’ క‌మర్షియ‌ల్ విజ‌యాల్ని అందుకుంటూనే మ‌హేష్‌కి మంచి పేరు తీసుకొచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: