సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమాగా వచ్చిన మహర్షి తో అతి పెద్ద ఎపిక్ బ్లాక్ బస్టర్ కొట్టిన అనంతరం తదుపరి చేయబోయే 26వ సినిమాపైనే అందరి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇంతవరకు ప్రారంభం కూడా జరుగని ఈ సినిమాకు బిజినెస్ కూడా ఊహించని స్థాయిలో జరుగనుందని టాక్. అంతేకాదు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో ప్రచారమవుతున్న కొన్ని వార్తల ప్రకారం ఈ సినిమా పక్కా హిట్ అని అంటున్నారు కొందరు ప్రేక్షకులు. 

అది ఏ విధంగా అంటే, ఇప్పటికే మహర్షి తో సూపర్ హిట్ కొట్టి వరుస బ్లాక్ బస్టర్ లతో మంచి జోష్ మీదున్న మహేష్, మరోవైపు ఇప్పటివరకు తాను తీసిన నాలుగు సినిమాలతో సూపర్ హిట్స్ సొంతం చేసుకుని అపజయమెరుగని దర్శకుడిగా దూసుకుపోతున్న అనిల్ రావిపూడి, అలానే ఇంకోవైపు చలో, గీత గోవిందం సినిమాలతో వరుస విజయాలు అందుకుని యూత్ లో మంచి క్రేజ్ సంపాదించిన హీరోయిన్ రష్మిక వంటి గోల్డెన్ హ్యాండ్స్ ఈ సినిమాకు తప్పకుండా మంచి సూపర్ హిట్ ని చేయడం ఖాయమని అంటున్నారు. 

ఇక మరోవైపు మహేష్ కూడా వరుసగా రెండు హిట్స్ కొట్టడంతో ఈ సినిమా కూడా హిట్ అయితే తన కెరీర్ లో ఇప్పటివరకు చూడని హ్యాట్రిక్ సూపర్ హిట్స్ ని సొంతం చేసుకున్నట్లే, ఇక అనిల్ రావిపూడి కి కూడా మొదటి సారి ఒక పెద్ద సూపర్ స్టార్ తో చేస్తున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకం, కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అని అంటున్నారు మరికొందరు నెటిజన్లు. అంతేకాదు మహేష్ అభిమానులు కూడా ఈ సారి తమ సూపర్ స్టార్ హ్యాట్రిక్ విజయం అందుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతవరకు ప్రారంభం కూడా కానీ ఈ సినిమాపై ఇప్పటినుండే ఇంత హైప్ క్రియేట్ చేస్తుండడంతో, రేపు సినిమా షూటింగ్ పూర్తి అయి విడుదల తరువాత ఎంతటి విజయాన్ని అందుకుని ప్రభంజనాన్ని సృష్టిస్తుందో వేచి చూడాలి మరి....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: