నిజంగా మహర్షి అంత పెద్ద హిట్టా .. దీనికి సమాధానం ఒక్క ముక్కలో చెప్పాలంటే కాదని చెప్పాలి. కానీ మహేష్ ఇది హిట్టేనని అదరగొట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నారు. మహేష్ బాబు, పవన్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో కొట్లాట వెరీ కామన్. ఇలా ఫ్యాన్స్ కొట్టుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి కానీ స్వయంగా మహేష్ తనకుతానుగా దొరికిన సందర్భాలు మాత్రం లేవు. ఈసారి మాత్రం నెటిజన్లకు దొరికిపోయాడు మహేష్. 


మహర్షి సక్సెస్ మీట్ తర్వాత వరుసగా ట్వీట్స్ పెట్టాడు మహేష్. వంశీ పైడిపల్లిని పొగడ్డంతో పాటు సినిమా సక్సెస్ అంటూ వరుసగా ట్వీట్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. దీంతో ఓ సెక్షన్ జనాలకు చిర్రెత్తుకొచ్చింది. "మహర్షి సినిమా సక్సెస్ అని ఒప్పుకుంటున్నాం ఇక వదిలేయ్ రా బాబూ" అంటూ రివర్స్ ఎటాక్ స్టార్ట్ చేశారు.  మహర్షి సినిమాకు మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. కొంతమందికి సినిమా నచ్చితే, చాలామందికి మూవీ నచ్చలేదు.


సరిగ్గా అదే పాయింట్ దగ్గర రంగంలోకి దూకాడు మహేష్. తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ప్రచారాన్ని ఊదరగొట్టాడు. రిలీజ్ రోజు నుంచి మొన్నటివరకు ప్రమోషన్ పేరిట కలియతిరుగుతూనే ఉన్నాడు. యూనిట్ కు సంబంధించి దొరికినవాళ్లను దొరికినట్టు పొగిడేస్తున్నాడు. ఈ అతిని కొంతమంది భరించలేక పోయారు. అదే టైమ్ లో సరిగ్గా ట్విట్టర్ లో దొరికాడు మహేష్. అంతే వరుసగా రివర్స్ ట్వీట్స్ తో ఆడేసుకున్నారు. సినిమా హిట్టని ఒప్పుకుంటాం ఇక ఆపేయ్ అంటూ సెటైర్లు షురూ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: