సెక్సీ స్టార్ పూనం పాండే రేటు చూసి స్టార్ హీరోయిన్లే పిచ్చెక్కిపోతున్నారు. వారు సినిమా మొత్తానికి తీసుకుంటున్న పారితోషికం కంటే పూనం కేవలం ఆ సినిమాలోని ఒక ఐటం సాంగ్ కు  50శాతం ఎక్కువ పారితోషికం తీసుకోవడంతో హీరోయిన్లంతా మతులు పోగొట్టుకుంటున్నారు.

పోని ఆమెకు మంచి నటిగా గుర్తింపు కూడా లేదు, కేవలం అందాలు ఆరబోయడమే ఆమె వద్ద ఉన్న టాలెంట్. అయినా సరే అంత రేటు ఇవ్వడానికి నిర్మాతలు కూడా ముందుకు రావడం అందరిని నివ్వెరపరుస్తోంది. నిషా సినిమాతో అందరికి మొహమాటం లేకుండా అంతా చూపించిన పూనం పాండేకు ఆ సినిమా అంతగా గుర్తింపును కూడా ఇవ్వలేదు.

కాని కన్నడ చిత్రపరిశ్రమ పూనం పాండేను అక్కున చేర్చుకుంది. కన్నడ చిత్రపరిశ్రమను మహారాణులుగా ఏలుతున్న స్టార్ హీరోయిన్ల కంటే ఎక్కువ పారితోషికం కేవలం ఒక్క పాటకోసమే ఆమెకు ఇస్తున్నారు. ఇప్పుడు కన్నడలో చిన్నికృష్ణ నృత్య దర్శకత్వంలో తీస్తున్న ‘లవ్ ఈజ్ పాయిజన్’ సినిమాలో ఐటం సాంగ్ కోసం పూనం పాండేకు ఏకంగా రూ.60లక్షలు ఇస్తున్నారట.

 విచిత్రం ఏంటంటే ఆ సినిమాలో హీరోయిన్ కే రూ.40 లక్షలు చెల్లిస్తున్నారట. అంతే కాదు కన్నడలో స్టార్ హీరోయిన్ల పారితోషికం రూ.40 లక్షలకు మించి లేదంటున్నారు. కాని పూనం రోజుకు 20లక్షలు సంపాదిస్తోంది అంటున్నారు. లవ్ ఈజ్ పాయిజన్ లో పూనం ఐటం సాంగ్ ను అక్టోబరు 3వ తేదినుంచి చిత్రీకరించనున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: