ఇప్పటికే కెరీర్ పరంగా ఎన్నో అద్భుత విజయాలు అందుకుని అభిమానుల గుండెల్లో యంగ్ టైగర్ గా చెరగని ముద్రవేసిన నందమూరి హీరో ఎన్టీఆర్, నేడు తన 36వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఇక ఉదయం నుండి అయన ఫ్యాన్స్ మరియు అనేమంది సినీ ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా మాధ్యమాల్లో పుట్టినరోజు విషెస్ తెలుపుతున్నారు. 

ఇక ప్రస్తుతం తనతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న కొణిదెల నటవారసుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కు తనదైన స్టయిల్లో విష్ చేసారు. కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమాల్లో చరణ్, 'నాకు మంచి మిత్రుడు, నాతో ఇంతగొప్ప సినిమాలో కలిసి నటిస్తున్న ఎన్టీఆర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, నువ్వు ఎప్పుడూ సకల సిరులతో, ఆరోగ్యంగా, ఆనందంతో ఆనందంగా జీవితం గడపాలని, ఎల్లప్పుడూ ఆ భగవంతుడి కృప నీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు అయన పోస్ట్ చేసారు. నిజానికి మెగా, నందమూరి ఫ్యాన్స్ మధ్య ఇప్పటివరకు కోల్డ్ వార్ నడిచేది, 

ఇక ఈ ట్వీట్ తరువాత, అలానే ఆపై రేపు ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ తరువాత ఈ వార్ పూర్తిగా సమసిపోయి మంచి మిత్రత్వం కూడా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. ఇకపోతే ఎన్టీఆర్, మహేష్, చరణ్ లు కలిసి ఇప్పటికే అనేక సార్లు, అనేక సందర్భాల్లో కలిసి రకరకాల వేడుకలను పంచుకున్న సందర్భాలు అనేకం, అలానే వాటికి సంబందించిన ఫోటోలు కూడా అప్పుడపుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో మనకు దర్శనం ఇస్తున్నాయి కూడా. ఈ విధమైన పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మన హీరోల మధ్య మంచి ఆరోగ్యకరమైన పోటీ నెలకొనే పరిస్థితులు కనపడుతున్నాయి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: