బాలీవడ్ బాద్‌షా, కింగ్‌ఖాన్ షారుఖ్‌ఖాన్ అప్‌క‌మింగ్ ఫిల్మ్ హ్యాపీన్యూఇయ‌ర్ మూవీపై అప్పుడే చ‌ర్చలు జ‌రుగుతున్నాయి. ఈ మూవీలో షారుఖ్ స‌ర‌స‌న దీపికాప‌దుకొనె హీరోయిన్‌గా న‌టిస్తుంది. వీరిద్దరి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన చెన్నైఎక్స్‌ప్రెస్ మూవీ ఇండియ‌న్ బాక్సాపీస్ రికార్డుల‌ను బ‌ద్దలు కొట్టడంతో, వీరి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న హ్యాపిన్యూఇయ‌ర్ మూవీపైనా బాలీవుడ్‌లో భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి . ఇదిలా ఉంటే షారుఖ్‌ఖాన్ హ్యాపిన్యూఇయ‌ర్ మూవీలో ఎటువంటి లుక్‌లో క‌నిపించ‌బోతున్నాడు అనేది అభిమానుల క్యూరియాసిటి. దీనికి సంబంధించిన ఒక స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇందులో షారుఖ్‌ఖాన్ స్పీచ్ ఇస్తూ, త‌న హెయిర్‌లో ఒక లేయ‌ర్ వైట్ హెయిర్‌తో క‌నిపించింది. షారుఖ్‌ఖాన్ పెద్దత‌ర‌హా మ‌నిషిగా, రియ‌ల్ కార్పోరేట్ జెంటిల్‌మెన్‌లా ఫ‌స్ట్‌లుక్‌లో క‌నిపించాడు. హ్యాపీన్యూఇయ‌ర్ మూవీలో షారుఖ్ ప్రాత డీసెంట్ అని బాలీవుడ్ అంటుంది. షారుఖ్ క‌నిపించిన ఈ లుక్‌పై ఇండ‌స్ట్రీలో ర‌క‌ర‌కాల కామెంట్స్ వ‌స్తున్నాయి. షారుఖ్‌ఖాన్ సింప్లి గుడ్ లుకింగ్ అని అంటున్నారు. ఈ మూవీను 2014, అక్టోబ‌ర్‌లో రిలీజ్ చేసుకుందుకు ప్లానింగ్స్ జ‌రుగుతున్నాయి. ఈ మూవీకు సంబంధించిన షూటింగ్ రీసెంట్‌గా లండ‌న్‌లో జ‌రిగింది. ఇంకో విష‌యం ఏంటంటే షారుఖ్ న‌టిస్తున్న ఈ మూవీకు త‌న భార్యే నిర్మాత‌గా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: