మహేష్ బాబు మహర్షి సినిమా రిలీజ్ అయ్యి 11 రోజులైంది.  ఇప్పటికే చాలా చోట్ల నాన్ బాహుబలి  రికార్డులను అందుకుంది.  కొన్నిచోట్ల ఇప్పటికే బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాట  పట్టింది.  టోటల్ గా చూసుకుంటే ఈ సినిమా మహేష్ కెరీర్లోనే బెస్ట్ హిట్ గా నిలిచిందని చెప్పొచ్చు.  యూఎస్ లో మాత్రం అనుకున్నంతగా కలెక్షన్లు రాలేదు.  ఎవెంజర్స్ సినిమా మానియా వలన మహర్షిని అక్కడ మహర్షికి ఆదరణ తగ్గిందన్నది వాస్తవం. 


ఇదిలా ఉంటె, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసి 150 కోట్ల రూపాయల దిశగా దూసుకుపోతున్నది.  ముఖ్యంగా నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించి మూడున్నర కోట్ల  రూపాయలకు పైగా లాభాలు తెచ్చింది.  ఏరియాల వారీగా మహర్షి ఎంత షేర్ వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం. 


నైజాం  - 25.4 కోట్లు 
సీడెడ్ - 9.06 కోట్లు 
గుంటూరు - 7.86 కోట్లు 
వైజాగ్ - 8.94 కోట్లు 
తూర్పు గోదావరి - 7.92 కోట్లు 
పశ్చిమ గోదావరి - 5.51 కోట్లు 
కృష్ణ - 5.42 కోట్లు 
నెల్లూరు - 2.70 కోట్లు 
వెరసి మొత్తం ఏపీ తెలంగాణలో మహర్షి 72.79 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది.  ఇది మహేష్ కెరీర్లో బెస్ట్ వసూళ్ళని చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: